ఏపీలో మూడో ఫ్రంట్‌కు ఛాన్సుందా ..!
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పార్టీల హవానే కనిపిస్తోంది. ఒకటి వైసీపీ, రెండు టీడీపీ కూటమి. దీనికి మించి రాజకీయంగా దూకుడు చూపించే పార్టీలు లేవు.
By: Garuda Media | 25 Nov 2025 6:00 AM ISTప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో మూడో ఫ్రంట్(తృతీయ పక్షానికి)కు అవ కాశం ఉందా? అనేది చర్చ. అయితే.. ఈ విషయంపై ఎప్పటికప్పుడుచర్చ సాగుతూనే ఉంది. కానీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న పార్టీలేకనిపిస్తున్నాయి. నిలదొక్కుకుని.. ప్రజల మధ్య సత్తా చూపించే రాజకీయ పార్టీ ఇటీవల కాలంలో జనసేన తర్వాత మరొకటి కనిపించదు. వాస్తవానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారా యణ కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు.
గత 2019 ఎన్నికలకు ముందు జేడీ సొంత పార్టీ పెట్టుకున్నా.. ఆశించిన మేరకు ఆయన ప్రజామోదం పొం దలేక పోయారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా.. సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థా పించారు. ఆ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను కూడా పోటీకి పెట్టారు. కానీ, ఫలితం కనిపించలేదు. ఇక, దీనికి ముందు లోక్‌సత్తా వంటివి వచ్చినా.. అవి కూడా బలం పుంజుకోలేక పోయారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. అసలు మూడో ఫ్రంట్‌పై చర్చ ఎందుకు వచ్చిందన్నది కీలకం.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పార్టీల హవానే కనిపిస్తోంది. ఒకటి వైసీపీ, రెండు టీడీపీ కూటమి. దీనికి మించి రాజకీయంగా దూకుడు చూపించే పార్టీలు లేవు. కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ.. వారి ప్రభావం ఎన్నికల స మయంలో కనిపించడం లేదు. ఇక, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా తలకిందులు అయిన విషయం తెలిసిందే. విభజన తర్వాత.. ఆపార్టీ అతికష్టం మీద తెలంగాణలో అధికారం దక్కించుకున్నా.. ఏపీలో ప్రా భవమే కోల్పోయింది. ఈ నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటు లేదా.. మూడో పార్టీకి అవకాశం ఉంటుం దన్నది విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో.. ఏ పార్టీఅయినా.. బలంగా నిలబడితే.. మూడో పార్టీకి.. లేదా తృతీయ పక్షానికి అవకాశం ఉం టుందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలకు సొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. తటస్థంగా ఉన్న ఓటర్లు కూడా కనిపిస్తున్నాయి. వీరి సంఖ్య 20 శాతం వరకు ఉంటుందన్న అంచనా ఉంది. ఇదే ఎన్నికల సమయంలో పార్టీ భవితను మారుస్తోంది. వాస్తవానికి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా 18 సీట్లు వచ్చినా.. ఓటు బ్యాంకు మాత్రం 22 శాతం వరకు సంపాయించుకున్నారు. దీనికి కారణం ఏపీ రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉండడమే. ఇప్పటికీ అది ఉందన్నది పరిశీలకుల అంచనా. అందుకే తృతీయ పక్షానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
