అరెస్టుకు రెడీ...ప్రొఫెసర్ నాగేశ్వర్ షాకింగ్ కామెంట్స్ !
ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయని తెలంగాణా రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు.
By: Satya P | 26 May 2026 6:45 AM ISTతనను అరెస్టు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని ఒక తెలుగు చానల్ డిబేట్ సందర్భగ్నా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. తాను దేనికీ భయపడను అన్నారు. ఈ మధ్య తన మీద పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిందని ఆ సందర్భంగా కొంత మంది తనకు అరెస్టు జరిగే అవకాశం ఉందని చెప్పారని అయినా సరే తాను ఇంట్లోనే ఉన్నాను అని ఆయన అన్నారు. అరెస్టు చేసుకోవాలనుకుంటే సరే. నేను ముందస్తు బెయిల్ కి కూడా ఇంతవరకూ అప్లై చేయలేదని ఆయన అన్నారు. ఇక తన మీద పెట్టిన కేసుని కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదని నాగేశ్వర్ చెప్పారు. తన జీవితంలో విద్యార్ధి ఉద్యమాలలలో పాల్గొన్నాను అని ప్రజా ఉద్యమాలు చేశాను అని చట్ట సభలలో ఉన్నాను అని ఆయన చెబుతూ అరెస్టు అయితే జైలు జీవితం కూడా ఒక అనుభవంగా తనకు ఉంటుందని చెప్పుకొచ్చారు.
అరెస్ట్ చేస్తే ముట్టడి :
ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయని తెలంగాణా రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆయనను కనుక అరెస్ట్ చేస్తే మాత్రం హైదరాబాద్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. తెలంగాణాకు చెదిన మేధావిని అరెస్టు చేయాలనుకోవడం దారుణం అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కాకుండా చూడాలని ఆమె కోరారు.
పవన్ హాట్ కామెంట్స్ :
మరో వైపు చూస్తే రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు ప్రస్తావించకుండా ఒక విశ్లేషకుడు అని సంబోధించారు. ఆయన క్రెడిబిలిటీ ఉన్న వారు అంటూనే ఈ విధంగా మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. ఎవరో దారిన పోయే వారి మాదిరిగా మాట్లాడడం ఏమిటి అని కూడా ప్రశ్నించారు. మీరు అన్నీ అనేయవచ్చు, మేము భరించాలా అని కూడా పవన్ అన్నారు. ఇక తనను అనడం కాదని కేంద్ర హోం మంత్రి మీద అనడమే బాధ కలిగించింది అని ఆయన అన్నారు. ఈ విధంగా పవన్ వ్యాఖ్యానించడం ద్వారా జనసేనలో ప్రొఫెసర్ మాటల వేడి ఇంకా అలాగే ఉందని చెప్పినట్లు అయింది అని అంటున్నారు.
నిజంగా జరుగుతుందా :
ఈ మధ్యనే సీపీఐ నాయకుడు నారాయణ ప్రొఫెసర్ ని అరెస్టు చేయదలచుకుంటే కాక్రోచులు బయలుదేరి సంఘీభావంగా ఆయన వెంట వస్తాయని అన్నారు. అంతే కాదు నాగేశ్వర్ సీఎం అయిపోతారు అని కూడా చెప్పారు. ఆయన్ని అరెస్టు చేయడమేంటి అని ప్రశ్నించారు. ఇవన్నీ చూసినపుడు అయితే నాగేశ్వర్ అరెస్టు విషయం అలా నలుగుతూనే ఉంది. ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన అరెస్ట్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా ఆయన అరెస్టు అవుతారా దానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నదే చూడాల్సి ఉంది.
