Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొత్త ప్రయోగం...ప్రియాంక అయితేనే బెటర్

లోక్ సభలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఎన్డీయేని నిలదీసే బాధ్యతలో కాంగ్రెస్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీదే అతి ముఖ్య పాత్ర.

By:  Satya P   |   9 Dec 2025 10:24 PM IST
కాంగ్రెస్ కొత్త ప్రయోగం...ప్రియాంక అయితేనే బెటర్
X

కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పార్టీ వయసు అక్షరాలా 140 ఏళ్ళకు పై మాటే. స్వాతంత్ర్యానికి పూర్వం కాంగ్రెస్ వేరు. వచ్చాక నెహ్రూ హయాంలో కాంగ్రెస్ వేరు. ఇక శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిగా సొంత కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆమె తన రెండవ కుమారుడు సంజయ్ గాంధీని ప్రోత్సహించారు. అయితే విధి వేరేలా తలచింది. ఆయన దుర్మరణం పొందారు. దాంతో రాజీవ్ గాంధీ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయ్యారు. ఇక రాహుల్ హత్య తరువాత కాంగ్రెస్ పగ్గాలు సోనియా గాంధీ చేతిలోనికి ఆటోమేటిక్ గా వచ్చాయి. ఆ మీదట రాహుల్ గాంధీ హవా మొదలైంది. ఇక పార్టీలో ప్రియాంకా గాంధీ కూడా ఉన్నా 2024 లో వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆమె పోటీ చేసి గెలవడంతో ఆమె కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా మారారు

బెటర్ పెర్ఫార్మెన్స్ :

లోక్ సభలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఎన్డీయేని నిలదీసే బాధ్యతలో కాంగ్రెస్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీదే అతి ముఖ్య పాత్ర. కానీ రాహుల్ గాంధీ కంటే కూడా ఒక సాధారణ ఎంపీగా ఉన్న ప్రియాంకా గాంధీయే తన ప్రసంగంతో ఎన్డీయేను బాగా ఇరుకున పెడుతున్నారు. గతంలో వర్షాకాల సమావేశాలలో సైతం ప్రియాంకా గాంధీ అధికార పక్షాన్ని సూటిగానే ప్రశ్నిస్తూ వచ్చారు. అనేక లాజిక్ పాయింట్లను సభ ముందు ఉంచారు. ఇక ఈసారి కూడా ఆమె ప్రసంగం హైలెట్ గా ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి వందేమాతరం గీతం పై పార్లమెంట్ ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రియాంకా గాంధీ చేసిన ప్రసంగానికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇది కదా కావాల్సింది :

ఇక రాహుల్ గాంధీ ప్రసంగం ఎంతసేపూ పడికట్టు పదాలతో సాగుతుంది. ప్రతీ దానిని తిప్పి తిప్పి మోడీకే నేరుగా అంటగట్టడం, ఓటు చోరీ మరో చోరీ అంటూ చెప్పిన దానినే చెబుతూ అసలు విషయాలు లోతైన సమస్యలను ఆయన ప్రస్తావించడం తగ్గించారు అని అంటున్నారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ స్పీచ్ లో కంటే ప్రియాంక స్పీచ్ లో విస్తృతమైన అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే విధంగా తాను ప్రసంగిస్తున్నపుడు అధికార పక్షం నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చినా విమర్శలు చేసినా ఆమె చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న తీరు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఆమె ఎదుగుతున్న తీరుకు నిదర్శనం అని అంటున్నారు. ఇక ఒక అంశం మీద ఆమె ప్రసంగిస్తున్నప్పుడు సూటిగా సుత్తి లేకుండా నిలదీస్తున్న విధానం అయితే కనిపిస్తుంది అని అంటున్నారు.

విఫల ప్రయోగంగా :

కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనను ప్రధాని పీఠానికి ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. అయితే రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ కి పెద్దగా లాభాలు చేకూరకపోగా ప్రతీసారి ఘోర ఓటములే దక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన ప్లేస్ లో ప్రియాంకా గాంధీని కనుక పగ్గాలు అప్పగించి ముందుకు తెస్తే కొంతలో కొంత కాంగ్రెస్ పరిస్థితి బాగుపడుతుంది అని అంటున్నారు. ఈ మధ్యనే బీహార్ లో జరిగీన్ ఎన్నికల ప్రచార సభలలో సైతం అన్న రాహుల్ గాంధీ కంటే చెల్లెలు ప్రియాంకా గాంధీ బాగా మాట్లాడారు, ఆమె ఎన్డీయే మీద బీజేపీ మీద పదునైన విమర్శలు చేశారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా హోప్స్ కావాలన్నా పెద్ద దిక్కుగా ప్రియాంకా గాంధీయే కనిపిస్తున్నారు అని అంటున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఇదే అయినా సోనియా గాణీ మాత్రం రాహుల్ గాంధీ వైపే ఈ రోజుకీ మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ తన ఆలోచనలు ఏ మాత్రం మార్చుకున్నా ప్రియాంకా గాంధీ చేతిలో కాంగ్రెస్ ఏమైనా సత్తా చాటే చాన్స్ అయితే ఉందని అంటున్నారు అంతా.