ప్రియాంక నుంచి నేర్చుకోవాలంటూ రాహుల్
ప్రియాంకా గాంధీ చక్కగా మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు చెప్పినది కాదు వాయనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చిన తరువాత ఆమె లోక్ సభలో చేసిన తొలి ప్రసంగం నుంచి ఆమెలోని పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది.
By: Satya P | 17 April 2026 5:02 PM ISTప్రియాంకా గాంధీ చక్కగా మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు చెప్పినది కాదు వాయనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చిన తరువాత ఆమె లోక్ సభలో చేసిన తొలి ప్రసంగం నుంచి ఆమెలోని పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె విమర్శలు చేస్తారు. అయితే అందులో సెటైర్లు జోడిస్తారు. అవతల వారికి అర్థం కావాలి, మ్యాటర్ అందరికీ తెలియాలి, అదే సమయంలో సునిశితమైన హాస్యంతో కూడిన తీరు ఉండాలి. ఇదీ మంచి ప్రసంగీకుల లక్షణం. ప్రియాంకా గాంధీ అదే అనుసరిస్తున్నారు. గట్టిగా అరచి మాట్లాడడం సభా మర్యాదకు కూడని పదాలని తెచ్చి వాడడం కించ పరచడం లాంటివి ఆమె ప్రసంగాలలో కనిపించవు. అందుకే ఆమె మాట్లాడుతూంటే అధికార పక్షం నుంచి కూడా సైలెన్స్ ఉంటుంది. ఆమె స్పీచ్ ని అంతా జాగ్రత్తగా వింటారు.
చెల్లెలు సూపర్ :
ఇదిలా ఉంటే నా చెల్లెలు ప్రియాంకా గాంధీ సూపర్ అంటూ ఆమె అన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ సాక్షిగా మెచ్చుకున్నారు. నా ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవంలో సాధించలేనిది ఆమె సాధించారు అందుకే గర్వంగా ఉంది అని కూడా అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె నవ్వించారు అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఇదే అమిత్ షాతో రాహుల్ గాంధీ బడ్జెట్ సెషన్ లో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్యన గట్టిగానే డైలాగ్ వార్ నడచింది. రాహుల్ మాట్లాడుతూంటే అధికార పక్షం సీరియస్ గానే రియాక్ట్ అవుతుంది. బహుశా అందుకేనేమో రాహుల్ తన చెల్లెలు గ్రేట్ అన్నది.
చాణక్యుడితో పోలుస్తూ :
ఇంతకీ ప్రియాంకా గాంధీ అన్నది ఏంటి అంటే ఈ రోజున చాణక్యుడు బతికి వచ్చి సభలో చూస్తే కనుక బీజేపీ పెద్దల వ్యూహాలకు ఆశ్చర్యపోతారు అని. దాంతో అమిత్ షా తో పాటుగా కేంద్ర మంత్రులు నవ్వేశారు. ప్రియాంకా గాంధీ అధికార పక్షాన్ని ఏమీ పొగడలేదు, దెప్పి పొడిచారు, సరైన పోలికలు తెచ్చి మరీ సభలో ఆహ్లాదకరమైన వాతావరణంలోనే కాంగ్రెస్ చెప్పదలచుకున్నది చెప్పారు. దానినే ఇపుడు రాహుల్ గాంధీ పొగిడారు. ఇక ప్రత్యేక సమావేశాల రెండవ రోజున ఆయన కూడా చెల్లెలు బాటలోనే సభలో చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు.
మోడీకి నాకు ఆ బాధ లేదు :
మహిళ ప్రతీ కుటుంబంలో కేంద్ర బిందువుగా ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. తల్లిగా చెల్లిగా భార్యగా అంటూ ఆయన ఒక్కసారి నవ్వేశారు. తనకు మోడీకి ఆ కుటుంబ బాధలు బాధలు లేవు అంటూ రాహుల్ వ్యాఖ్యానించగానే సభలో అంతా నవ్వేశారు. ఇక తన చెల్లెలు గురించి ఆయన మాట్లాడుతూ, రాజకీయ జీవితంలో ఆమె నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని లోక్ సభలోనే బహిరంగంగా అంగీకరించారు.
నారీ శక్తి గొప్పది :
సభలో రాహుల్ మాట్లాడుతూ నారీ శక్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారే చోదక శక్తి అని ఆయన అన్నారు. మన జాతీయ భావనలో మహిళలు చోదక శక్తి అని అభివర్ణించారు. ప్రతీ వారి జీవితాల్లోని తల్లులు, సోదరీ మణులు ఇతర మహిళల నుండి ఎంతో నేర్చుకుంటామని ఎంతో నేర్చుకుంటామని అన్నారు. అలాగే ఎంతగానో మహిళల వల్ల జీవితంలో ప్రభావితమవుతామని అన్నారు. ఈ సందర్భంగా తన యుక్తవయస్సులో చీకటి అంటే భయపడినప్పటి కథను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన అమ్మమ్మ తనకు ఎలా సలహా ఇచ్చి తనంకు జీవిత సత్యాలను బోధించిందో ఆయన సభకు వివరించారు.
