Begin typing your search above and press return to search.

తొలి ఆర్నెల్లలో టాప్ లో నిలిచిన ప్రిస్టేజ్ రియల్ ఎస్టేట్స్

దేశీయ స్థిరాస్తి రంగంలో అమ్మకాల బుకింగ్స్ విషయంలో ఏ సంస్థ టాప్ పొజిషన్ లో ఉందన్న విషయాన్ని తెలిపే గణాంకాలు వెల్లడయ్యాయి.

By:  Garuda Media   |   24 Nov 2025 9:56 AM IST
తొలి ఆర్నెల్లలో టాప్ లో నిలిచిన ప్రిస్టేజ్ రియల్ ఎస్టేట్స్
X

ఆసక్తికర రిపోర్టు ఒకటి అందుబాటులోకి వచ్చింది. దేశీయ స్థిరాస్తి రంగంలో అమ్మకాల బుకింగ్స్ విషయంలో ఏ సంస్థ టాప్ పొజిషన్ లో ఉందన్న విషయాన్ని తెలిపే గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లకు (ఏప్రిల్ - సెప్టెంబరు) సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 28 దిగ్గజ స్థిరాస్తి సంస్థల్లో బెంగళూరుకు చెందిన ప్రిస్టేజ్ ఎస్టేట్స్ టాప్ లో నిలిచింది.

ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆర్నెల్లలో రూ.92,437 కోట్ల విలువైన స్థిరాస్తులను విక్రయించినట్లుగా రిపోర్టు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26 దిగ్గజ నమోదిత స్థిరాస్తి సంస్థలు రూ.1.62 లక్షల కోట్ల స్థిరాస్తులను అమ్మగా.. గత సంవత్సరంలో గోద్రేజ్ ప్రోపర్జీస్ రూ.30వేల కోట్ల అమ్మకాలతో టాప్ లో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆర్నెల్లలోనే చక్కటి గణాంకాలు నమోదయ్యాయని చెప్పొచ్చు.

ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆర్నెల్లలో ప్రిస్టేజ్ ఎస్టేట్స్ రూ.18,143.7 కోట్ల అత్యధిక విక్రయాల బుకింగ్ లను నమోదు చేయగా.. డీఎల్ఎఫ్ రూ.15,757 కోట్ల ఫ్రీ సేల్స్ తో రెండో స్థానంలో నిలిచింది. ముంబయికి చెందిన గోద్రెజ్ ప్రోపర్టీస్ రూ.15,587 కోట్ల బుకింగ్ లతో మూడో స్థానంలో నిలిచింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే దేశంలోనే అతి పెద్ద స్థిరాస్తి సంస్థ అయిన డీఎల్ఎఫ్ ను బెంగళూరుకు చెందిన ప్రిస్టేజ్ ఎస్టేట్స్ దాటేయటం. టాప్ 5 జాబితాలో నాలుగో స్థానంలో లోధా డెవలపర్స్ రూ.9020 కోట్లు.. ఢిల్లీ-ఎన్ సీఆర్ కు చెందిన సిగ్నేచర్ గ్లోబల్ రూ.4650 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాయి.

ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మొత్తం లావాదేవీల్లో టాప్ 5 సంస్థల లావాదేవీలే 70 శాతానికి పైనే ఉండటం. వీటి బుకింగ్ ల విలువ రూ.63వేల కోట్లు కావటం గమనార్హం. ఆర్నెల్ల వ్యవధిలో వెయ్యి కోట్ల మార్కును దాటిన లావాదేవీలు నిర్వహించిన రియల్ సంస్థల విషయానికి వస్తే..

రియల్ ఎస్టేట్ సంస్థ బుకింగ్ విలువ (రూ.కోట్లల్లో)

శోభ లిమిటెడ్ 3981

బిగ్రేడ్ ఎంటర్ ప్రైజెస్ 3152

ఒబెరాయ్ రియాల్టీ 2937

కల్పతరు లిమిటెడ్ 2577

పూర్వాంకర 2455

కీస్టోన్ రియల్టర్స్ 1839

సన్ టెక్ రియాల్టీ 1359

ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ 1312

కోల్టే పాటిల్ డెవలపర్స్ 1286

మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ 1200

శ్రీరామ్ ప్రోపర్టీస్ 1126