"100 మంది అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే పవిత్రం"!
ఇటీవల కాలంలో మహిళల వస్త్రధారణపైనా, వారి నడవడికలపైనా పలువురు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 30 July 2025 1:10 AM ISTఇటీవల కాలంలో మహిళల వస్త్రధారణపైనా, వారి నడవడికలపైనా పలువురు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన ప్రముఖ సాధువు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యల చుట్టూ పౌర సమాజంలో పెను వివాదం చెలరేగుతోంది.
అవును... ఉత్తరప్రదేశ్ లోని మధురకు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో భాగంగా... ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారని.. అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని.. అంటూ ప్రధానంగా నేటి తరం అమ్మాయిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం అని.. మిగతావారు తమ బాయ్ ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటున్నారని ప్రేమానంద్ అన్నారు. ఇదే సమయంలో... నలుగురు అబ్బాయులను కలిసిన అమ్మాయి.. మంచి కోడలు ఎలా అవుతుంది.. నలుగురు అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి మంచి భర్త ఎలా అవుతాడు అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా... ఒక పురుషుడు నలుగురు స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతను తన భార్యతో సంతృప్తి చెందడు.. ఎందుకంటే అతను వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. మరోవైపు, నలుగురు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకున్న స్త్రీ, ఒక భర్తతో సంతోషంగా ఉండదు.. అని ప్రేమానంద్ వ్యాఖ్యానించారు.
దీంతో... ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సాదువులు, కొంతమంది గురువులు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహరాజ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... సాదువులు సమాజానికి సరైన మార్గదర్శకంగా ఉంటారని కొందరు అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ప్రముఖ సాధువు మహంత్ రాజు దాస్... ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదని.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలనే ఆయన తెలిపారని అన్నారు. ఇదే సమయంలో.. మహిళా శక్తిని మనం ఆరాదిస్తాం కానీ, ప్రస్తుతం యువత సగం సగం బట్టలతో రోడ్లపై తిరుగుతున్నారని.. ఇది సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని.. ప్రముఖ గురువు శక్తికాంత దాస్ అన్నారు. ఈ సందర్భంగా... ప్రేమానంద్ మహారాజ్ కు బృందావన్ లో ప్రత్యేక స్థానం ఉందని.. ఆయన ప్రసంగాలు లక్షలాది మంది చూస్తారని.. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే ఉత్తమం అని అన్నారు.
