Begin typing your search above and press return to search.

పీకే ‘పీచేముడ్’.. ఈ ట్విస్ట్ ఊహించలేదు సామీ!

బిహార్‌లో అంగుళం అంగుళం తిరుగుతూ నితీశ్ పాలనపై విమర్శల బాణాలు విసిరిన ప్రశాంత్ కిశోర్.. ఒక్కసారిగా మహర్షిలా మారిపోయారు.

By:  A.N.Kumar   |   18 Oct 2026 10:00 PM IST
పీకే ‘పీచేముడ్’.. ఈ ట్విస్ట్ ఊహించలేదు సామీ!
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు.. ఉండరంటారు.. కానీ పీకే అదే మన ప్రశాంత్ కిశోర్ గారి ‘పాదయాత్ర పాలిటిక్స్’ చూస్తుంటే అసలు శాశ్వతమైన అభిప్రాయాలే ఉండవేమో అనిపిస్తోంది.. నిన్నటిదాకా నితీశ్ కుమార్‌ను బిహార్ అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి అని.. అవినీతి కింగ్‌పిన్ అని ముద్రవేసిన జనసురాజ్ అధినేత పీకే.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ‘పీచేముడ్’ అనడంతో నెటిజన్లు, రాజకీయ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు.

టాప్-10లో నితీశ్.. పీకే గారి కొత్త ‘ర‍్యాంకింగ్’

బిహార్‌లో అంగుళం అంగుళం తిరుగుతూ నితీశ్ పాలనపై విమర్శల బాణాలు విసిరిన ప్రశాంత్ కిశోర్.. ఒక్కసారిగా మహర్షిలా మారిపోయారు. నితీశ్ కుమార్ రాష్ట్రంలోనే అత్యంత వివేకవంతమైన నాయకుడట.. అంతేకాదు.. బిహార్ చరిత్రలోనే టాప్-10 ఉత్తమ నాయకుల జాబితా తీస్తే ఆయన కచ్చితంగా ఉంటారట.. ఈ మాట విన్న జేడీయూ నాయకులకు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయో లేదో తెలీదు కానీ సామాన్య జనాలకు మాత్రం మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. “ఏంటి పీకే గారూ.. నిన్నటిదాకా అది విమర్శ.. నేడు ఇది ప్రశంసా? లేక మీ పొలిటికల్ డిజైన్ సాఫ్ట్‌వేర్ ఏమైనా అప్‌డేట్ అయిందా?” అని బిహార్ జనాలు సెటైర్లు వేస్తున్నారు.

ఎమ్మెల్యే హత్య వ్యాఖ్యలకు పీకే గారి ‘కవరింగ్ సర్కస్’

ఇక నితీశ్ కోసం తొమ్మిది మందిని చంపానంటూ ఒక ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలపై పీకే స్పందించిన తీరు మరీ విశేషం. దాన్ని ఖండించాల్సింది పోయి.. “అయ్యో మీరు ఆ ఎమ్మెల్యే మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు సామీ” అంటూ ఉచిత సలహా, వివరణ ఇచ్చేసరికి పొలిటికల్ సర్కిల్స్‌లో నవ్వులు పూశాయి. నితీశ్‌ను కాపాడేందుకు పీకే గారు పడుతున్న ఈ ‘కవరింగ్ తాపత్రయం’ చూస్తుంటే.. పాత బంధం మళ్లీ చిగురిస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

యూటర్న్‌ల మాస్టర్.. అసలు వ్యూహం ఏంటి?

ఒకప్పుడు జేడీయూలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసి.. ఆ తర్వాత బయటకు వచ్చి ‘నేనే ప్రత్యామ్నాయం’ అని ప్రచారం చేసుకున్న పీకే.. ఇప్పుడు మళ్లీ నితీశ్‌కు భజన చేయడం వెనుక ఉన్న ‘మాస్టర్ ప్లాన్’ ఏమిటో ఆయనకే తెలియాలి. ఇది కేవలం మాటల గారడీనా? లేక రాబోయే ఎన్నికల్లో కొత్త రాజకీయం కోసం వేస్తున్న రూట్ మ్యాపా? ఏది ఏమైనా బిహార్ రాజకీయంలో నితీశ్ కుమార్ పదే పదే కూటములు మారితే యూటర్న్ అంటారు.. కానీ పీకే గారు అభిప్రాయాలే మార్చేస్తే దాన్ని ‘వ్యూహం’ అంటారేమో.. రానున్న రోజుల్లో పీకే గారు ఇంకా ఎన్ని సర్కిల్స్ తిరుగుతారో చూడాలి..