డిపాజిట్లు గల్లంతులో పీకే 99 శాతం రివర్స్ స్ట్రైక్ రేట్
ఇక పీకే జన సురాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కేవలం ఒకే ఒక స్థానంలో రెండవ స్థానంలో ఉంటే మొత్తం 122 చోట్ల నాలుగవ స్థానంలోకి జారిపోయింది.
By: Satya P | 18 Nov 2025 3:00 AM ISTబీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశంలో ఎంతో ఆసక్తిని పెంచాయి. ఈ ఫలితాలు చూసిన వారు అంతా సరికొత్త చర్చకు తెర తీశారు. ఈ విధంగా కూడా ఓటర్ల తీర్పు ఉంటుందా అన్నది కూడా చర్చలో భాగమే. ఒకే పార్టీకి అవుట్ రేట్ గా ఓట్లు వేయడం ఇటీవల కాలంలో వస్తున్న ట్రెండ్. దాంతో విపక్షాలకు ఏ మాత్రం కూడదీసుకునే చాన్స్ ఉండడం లేదు, అలా బీహార్ లో కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజారిటీ ఎన్ డీయే ప్రభుత్వానికి జనాలు అందించారు. ఏకంగా 202 సీట్లు సాధించి తనకు తిరుగులేదు అనిపించుకుంది. ఇక మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తామని ఎంతో ధీమాని ప్రదర్శితే కేవలం 35 సీట్లు మాత్రమే దక్కాయి.
వ్యూహకర్త కు షాక్ :
ఇక దేశంలో పేరు ఎన్నిక గన్న వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పార్టీ జన సురాజ్ కి దిమ్మదిరిగేలా జనాలు తీర్పు ఇచ్చారు. ఎంతో మందిని ముఖ్యమంత్రులుగా చేశాను అని ప్రకటించుకునే పీకే తన పార్టీ పూర్ పెర్ఫామెన్స్ కూడా కాదు వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది అని ఒప్పుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన పార్టీ మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో 238 సీట్లకు పోటీ చేస్తే అందులో ఏకంగా 236 సీట్లలో అభ్యర్ధులకు డిపాజిట్లు పోయాయి. అంటే ఇది 99 శాతం రివర్స్ స్ట్రైక్ రేట్ అన్న మాట. మొత్తం విన్నింగ్ ఓటు షేర్ లో ఆరవ వంతు ఓట్లు తెచ్చుకుంటే అభ్యర్ధి కట్టిన పది వేల రూపాయలను తిరిగి ఎన్నికల సంఘం ఇస్తుంది. అంటే ఆ డిపాజిట్లు కూడా గల్లంతు అయ్యాయన్న మాట. కేవలం ఇద్దరికి మాత్రమే డిపాజిట్ దక్కింది అనుకోవాలి
జీరో నంబర్ తో :
ఇక పీకే జన సురాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కేవలం ఒకే ఒక స్థానంలో రెండవ స్థానంలో ఉంటే మొత్తం 122 చోట్ల నాలుగవ స్థానంలోకి జారిపోయింది. మరో 61 సీట్లలో నోటా కంటే కూడా తక్కువ ఓట్లు రాబట్టుకుని వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మొత్తంగా పీకే పార్టీకి 3.34 ఓటు షేర్ అలాగే 16.77 లక్షల ఓట్లు వచ్చాయి. ఆరేడు కోట్ల మంది ఓటర్లు ఉన్న చోట పీకే పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఇక ఆ పార్టీ సంగతి ఏమిటో దేవుడికే ఎరుక అని అంటున్నారు.
ఆక్రోశంతో నేనా :
పీకే తన పార్టీ ఓటమి తరువాత ఎన్ డీయే మీద తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఎన్నికల కోసం గత ఆరు నెలలుగా నితీష్ కుమార్ సర్కార్ పనిచేస్తోందని ప్రపంచ బ్యాంక్ నిధులను 14 వేల కోట్ల రూపాయలను సైతం ఉచితాల కోసం దారి మళ్ళించిందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ఏకంగా నలభై వేల కోట్ల రూపాయల దాకా కేవలం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఖర్చు చేశారు అని ఆయన విమర్శించారు. అయితే పీకే ఆరోపణలు అన్నీ ఆకొరశంతో చేసినవే అని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఆ పార్టీ నేత అమిత్ మాలవ్య అయితే పీకే పార్టీ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని పెద్ద మాటే వాడారు.
ఎగ్జిట్ పోల్స్ ఎత్తేసినా :
ఇక పీకే పార్టీ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎత్తేశాయి, అది పీకే మీద అభిమానమో లేక ఆయన వ్యూహాల మీద నమ్మకమో తెలియదు కానీ ఏకంగా పది శాతం ఓటు షేర్ అలాగే మరో పది దాకా సీట్లు వస్తాయని బీహార్ లో హోరా హోరీ పోరు సాగి హంగ్ ఏర్పడుతుందని దాంతో పీకే కింగ్ మేకర్ అవుతారని కొంతమంది చెప్పారు. మరో వైపు చూస్తే జీరో సీట్లు వస్తాయని మరికొన్ని చెప్పినా ఇంత దారుణమైన పరాజయం మాత్రం ఎవరూ ఊహించలేదు, చెప్పలేదు, కానీ అది పీకే సొంతం అయింది. పార్టీ పెడుతూనే మొగ్గలోనే తుంచేసిన చందంగా పీకే రాజకీయం తయారైంది అని అంటున్నారు.
