Begin typing your search above and press return to search.

ఒక్క ఓటు కాదు.. 10 ఓట్లతో గేమ్ మార్చేస్తా.. ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు

ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు, పౌరసంఘాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   15 Aug 2026 6:18 PM IST
ఒక్క ఓటు కాదు.. 10 ఓట్లతో గేమ్ మార్చేస్తా.. ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
X

కర్ణాటకలో ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు, పౌరసంఘాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసే ప్రకాశ్‌రాజ్.. వచ్చే ఎన్నికల్లో తన పాత్ర ఎలా ఉండబోతుందో తనదైన శైలిలో వెల్లడించారు.

తన తదుపరి ఓటుకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని పేర్కొన్న ప్రకాశ్‌రాజ్.. తాను కేవలం ఒక ఓటు వేసే వ్యక్తిగా మాత్రమే ఉండబోనని అన్నారు. తన ఓటుతో పాటు మరో పది మంది ఓటర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభావితం చేయగలనని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

“ఒక్క ఓటు కాదు.. పది ఓట్లతో గేమ్ మార్చేస్తా” అన్న భావనలో ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని చెబుతూ ఓటర్లు తమ హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కర్ణాటకలో ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ల పేర్ల తొలగింపు, జాబితాలో మార్పులు వంటి అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌రాజ్ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని భావిస్తే, దాన్ని ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలోకి మార్చేందుకు ప్రజలను చైతన్యపరచాలని ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యల ద్వారా సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది రానున్న రోజుల్లోనే స్పష్టమవుతుంది.

ఇక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్య హక్కులు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ఇప్పటి నుంచే చర్చ మొదలవడం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రకాశ్‌రాజ్ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తున్నాయి.