ఆరేళ్ళలో మూడవ కండువా...బీజేపీనే ఎందుకంటే ?
ఆమె తెలంగాణా రాష్ట్రంలోని అలంపూర్ జెడ్పీటీసీగా తన పొలిటికల్ కెరీర్ మొదలెట్టారు. 2004లో అనంతపురం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అలంపూర్ నుంచే టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
By: Satya P | 16 Sept 2025 9:00 AM ISTరాజకీయాల్లో విధేయతలు ఒక్కప్పటి మాట. అధికారంలో ఉంటేనే కొనసాగుతామని కుండబద్దలు కొడుతున్నారు. దశాబ్దాల పార్టీలు అయినా జాతీయ స్థాయిలో దిగ్గజ పార్టీలు అయినా ఇదే సీన్ కనిపిస్తోంది. అంతవరకూ ఒక పార్టీకి జై కొట్టి ఓటమి పాలు కాగానే కొత్త సౌండ్ వినిపిస్తున్నారు అలాంటి వారు ఎందరో ఉన్నారు. అయితే తాజాగా చూస్తే కనుక ఆరేళ్ల వ్యవధిలో మూడు పార్టీల కండువాలు మార్చిన వారిలో పోతుల సునీత కనిపిస్తున్నారు అని అంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఆమె రాజకీయంగా రెండు దశాబ్దాల పాటు కొనసాగిన పార్టీలు మార్చిన విషయాన్నే అంతా గుర్తు చేసుకుంటున్నారు.
పసుపు పార్టీ నుంచే :
ఆమె తెలంగాణా రాష్ట్రంలోని అలంపూర్ జెడ్పీటీసీగా తన పొలిటికల్ కెరీర్ మొదలెట్టారు. 2004లో అనంతపురం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అలంపూర్ నుంచే టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక 2009, 2014 లలో కూడా పెనుగొండ, అనంతపురం లలో టికెట్ల కోసం చూశారు. అయితే 2014లో చీరాల అసెంబ్లీ టికెట్ ఆమెకు దక్కింది. కానీ ఓటమి పాలు అయ్యారు. అయితే 2017లో ఆమెని ఎమ్మెల్సీగా టీడీపీ నామినేట్ చేసింది. కానీ 2029 లో ఆమె వైసీపీ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతు తెలిపి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆ తరువాత టీడీపీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలా తొలి ఆరేళ్ల పదవీ కాలంలో సగం టీడీపీలో సగం వైసీపీలో పూర్తి చేసి 2023లో మరోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా రెండోసారి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అయితే 2024లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆమె వైసీపీకి గుడ్ బై కొట్టేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
షాక్ ఇచ్చిన టీడీపీ జనసేన :
ఇక ఆమె తన పదవికి రాజీనామా చేసినా టీడీపీలో తిరిగి చేరి అదే సీటు దక్కించుకోవచ్చు అధికార పార్టీ ఎమ్మెల్సీగా హవా చాటుకోవచ్చు అని ప్లాన్ చేశారు. అయితే టీడీపీ హైకమాండ్ ఆమె ప్లాన్స్ కి నో చెప్పేసింది. దానికి కారణం టీడీపీలో ఆమెకు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి అనేకసార్లు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్సీగా చేసినా వైసీపీలో చేరిపోయి అక్కడ నుంచి చంద్రబాబు లోకేష్ ల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అన్నది గుర్తు పెట్టుకుని మరీ టీడీపీ పెద్దలు ఆమెను వద్దనుకున్నారు. ఇక జనసేన సైతం ఆమె ఎంట్రీకి నో చెప్పేసింది. దాంతో ఆమె బీజేపీ వైపు వచ్చేశారు అని అంటున్నారు.
ఎమ్మెల్సీ కోరకుండానే :
బీజేపీలో ఆమె చేరిక వెనక కూడా కొంత కసరత్తు జరిగింది అని అంటున్నారు. బీజేపీ కూడా మిత్రులతో చర్చించే ఆమెను చేర్చుకుంది అని అంటున్నారు. ఆమె బీజేపీలో చేరినా రేపటి రోజున ఆమె వదిలేసిన ఎమ్మెల్సీ సీటు తిరిగి దక్కదని అంటున్నారు. ఆమె రాజకీయంగా కొనసాగడానికి మాత్రమే ఒక వేదికగా బీజేపీని ఎంచుకుంది అని అంటున్నారు. అందుకే విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పోతుల సునీత చేరారు అని అంటున్నారు. అయితే ఆమె నక్స్లలైట్ నేపథ్యం బీజేపీకి భారమే తప్ప ఉపయోగం కాదని అంటున్నారు. ఆమె విధేయత ప్రశ్నార్థకంగా మారిన నేపధ్యంలో ఆమె స్థాన బలం కూడా చెదిరిందని దాంతో పార్టీ కండువా కప్పి చేర్చుకున్నా కమలానికి పెద్దగా ప్రయోజనం ఏదీ ఉండదని అంటున్నారు.
