పోతుల పాట్లు.. కమల దళంలో ఇమడలేక కష్టాలు.. !
అక్కడితో అది అయిపోయింది. అయితే.. పోతుల తన అభ్యర్థనను పంపించి.. నెల రోజులు అయినా ఇంకా ఎలాంటి సమాధా నం రాకపోవడంతో ఎదురు చూపులు చూస్తున్నారు.
By: Garuda Media | 1 Nov 2025 12:00 AM ISTరాజకీయాల్లో నాయకులు అనుకున్నది ఒకటైతే.. జరిగేది మరొకటి ఉంటుంది. దీనిలో ఎలాంటి తేడా లేదు. అయితే.. కొన్ని కొన్ని సార్లు మరింతగా కూడా మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో టీడీపీ, తర్వాత వైసీపీ.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మహిళా నాయకురాలు పోతుల సునీత పరిస్థితి ఇలానే ఉందన్న చర్చ సాగుతోంది. ఇటీవల రెండు మాసాల కిందట ఆమె బీజేపీలో చేరారు. వాస్తవానికి తిరిగి ఘర్ వాపసీ అన్నట్టుగా టీడీపీ తీర్థం పుచ్చుకుందామని అనుకున్నారు.
కానీ, చీరాలకు చెందిన బలమైన టీడీపీ నాయకుడు ఒకరు.. అడ్డుపుల్ల వేయడంతో సునీత వెయింట్ లిస్టులోకి వచ్చారు. ఆ తర్వాత.. ఇక, అవకాశం లేదని తెలియడంతో బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఏకంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా సారథ్యంలో ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు. కానీ, అప్పటి నుంచి పోతుల మాట ఎక్కడా వినిపించడం లేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర చీఫ్ మాధవ్‌ను కలిసిన పోతుల.. తనకు ఏదైనా పదవి ఇవ్వమని కోరినట్టు కమలం నాయకులు చెబుతున్నారు.
కానీ.. మాధవ్ మాత్రం ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతానని సరిపుచ్చారు. అక్కడితో అది అయిపోయింది. అయితే.. పోతుల తన అభ్యర్థనను పంపించి.. నెల రోజులు అయినా ఇంకా ఎలాంటి సమాధా నం రాకపోవడంతో ఎదురు చూపులు చూస్తున్నారు. కానీ, ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు.. స్థానిక నాయకత్వంతోనూ పోతుల ఇమడలేక పోతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. సోము వీర్రాజు వంటి నాయకులతో కలిసి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నా.. ఆయన ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ఇటీవల సోము వీర్రాజు ప్రకాశంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనాలని పోతుల భావించారు. కానీ, అవకాశం చిక్కలేదు. దీనికి కారణం.. ఆది నుంచి సునీత ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు అలవాటుపడ్డారు. ఏ పార్టీలో ఉన్నామన్నది పక్కన పెడితే.. తను వ్యక్తిగతంగా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇచ్చారన్నది వాస్తవం. ఇది బీజేపీ నేతలకు.. ఆ పార్టీకి కూడా కడు దూరం. అందుకే.. వారితో ఆమె మింగిల్డ్ కాలేక పోతున్నారన్న వాదన ఉంది. అయితే.. ఇప్పుడిప్పుడే పార్టీలో చేరారు కాబట్టి.. ఆమె మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు నాయకులు.
