Begin typing your search above and press return to search.

సూర్యుడు రాశి మారాడు...చలి ఎలా ఉంది ?

సాధారణంగా ఖగోళ శాస్త్రం ప్రకారమే మన పండుగలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది సూర్యుడు అయినా చంద్రుడు అయినా వారి గమనం బట్టే భారతీయ పండుగలు అన్నీ ఉంటాయి

By:  Satya P   |   16 Jan 2026 9:20 AM IST
సూర్యుడు రాశి మారాడు...చలి ఎలా ఉంది ?
X

సాధారణంగా ఖగోళ శాస్త్రం ప్రకారమే మన పండుగలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది సూర్యుడు అయినా చంద్రుడు అయినా వారి గమనం బట్టే భారతీయ పండుగలు అన్నీ ఉంటాయి. ఇక మకర సంక్రాంతి చూస్తే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని బట్టి ఆ రోజుని సంక్రాంతి గా జరుపుకుంటారు. మరో వైపు చూస్తే అప్పటిదాకా దక్షిణాయనం కొనసాగుతుంది. ఆ సమయంలో సూర్యుడు భూమికి కాస్తా దూరంగా సంచరిస్తాడు. అందుకే వేడి తగ్గి చలి ఎక్కువగా ఉంటుంది. అయితే మకర రాశిలోకి ప్రవేశించాక సూర్యుడు తన దిశ మార్చుకుని మళ్ళీ దగ్గరగా వస్తాడు. దాంతో వేడి క్రమంగా పెరుగుతుంది. ఇది కాల చక్రంలో సహజంగా జరిగే ప్రక్రియ,.

చలి తగ్గిందింగా :

ఇదిలా ఉంటే భోగీ పండుగ అలా ముగిసి మకర సంక్రాంతి కూడా అయిపోయిన నేపధ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. నిన్నటిదాకా చలితో ఉన్న తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారింది అని అంటున్నారు. మెల్లగా ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది అని చెబుతున్నారు. ఇలా చూస్తే కనుక నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో పాటుగా పగటి వేళలు కూడా పెరుగుతున్నాయి.

జనాలు పెరిగారు :

గత మూడు నెలలుగా కర్యూ వాతావరణంగా సాయంత్రం అయితే చాలు కనిపించేది. జనాలు అంతా చలి పులికి జడిసి అసలు బయటకు వచ్చేవారు. కాదు, అంతవరకూ ఎందుకు మధ్యాహ్నం మూడు అయిన దగ్గర నుంచి శీతల గాలులు వీచి అయిదు దాటాక ఒక స్థాయికి చేరుకునేవి, దాంతో రాత్రిళ్ళు చలి వణికించేసేది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువగానే చలి ఉందని వాతావరణ శాఖ కూడా పేర్కొంది. కానీ సంక్రాంతి పండుగ ఇలా వెళ్ళగానే అలా చలి కూడా తగ్గుతోంది అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే ఉష్ణోగ్రతలు ఒకటి రెండు డిగ్రీలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలియచేస్తోంది.

అక్కడే అదే సీన్ :

ఇక తెలంగాణాలో చలి బాగా ఎక్కువ. కానీ ఇపుడు సీన్ మారుతోంది అని అంటున్నారు. సింగిల్ డిజిట్ తో మంచు ప్రాంతాలుగా మారిన అనేక జిల్లాలు నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి పుంజుకుంటున్నాయని అంటున్నారు. అలా చూస్తే కనుక చాలా కీలక జిల్లాలు ఉత్తర తెలంగాణా ప్రాంతాలలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైంది అని అంటున్నారు. దీంతో ఇపుడు స్వెట్టర్లు పక్కన పెట్టి ఫ్యాన్లకు పని చెబుతున్నారు అని అంటున్నారు నిజానికి చూస్తే మహా శివరాత్రి వరకూ చలి వాతావరణం ఉంటుంది, అపుడే శివ శివ అని వెళ్ళిపోతుంది. కానీ వాతావరణంలో భారీ మార్పులు వస్తున్నాయి. దాంతో ముందుగానే వేడిమి కనిపిస్తోంది. జనవరి మూడవ వారం దాటేసరికి ఇది మరింత స్పష్టం అయితే కనుక ఈసారి వేసవి ఎండలు కూడా దంచి కొట్టే పరిస్థితి ఉంటుందని లెక్క వేస్తున్నారు.