Begin typing your search above and press return to search.

‘జూబ్లీ’ ఉపపోరు ఎజెండా మార్చేలా బండి ప్రచారం

ఎవరెన్ని అన్నా.. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సంచలనం. ఆయన మాటలు పొందిగ్గా లేకపోవచ్చు.

By:  Garuda Media   |   7 Nov 2025 10:53 AM IST
‘జూబ్లీ’ ఉపపోరు ఎజెండా మార్చేలా బండి ప్రచారం
X

ఎవరెన్ని అన్నా.. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సంచలనం. ఆయన మాటలు పొందిగ్గా లేకపోవచ్చు. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా తూటా మాదిరి పేలుతుంది. ఎవరూ ఫోకస్ చేయని పాయింట్లను ప్రస్తావిస్తూ.. సరికొత్త ఎజెండాను తెర మీదకు తీసుకురావటం ఆయనకు అలవాటే. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్లుగా.. తన మాటల తూటాలతో సీన్ మొత్తాన్ని మార్చేసే తీరు తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప పోరు వేళలోనూ అలాంటి తీరునే ప్రదర్శింరచారు బండి.

బీజేపీ సీనియర్ నేత..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గడిచిన కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయనొక్కరే కాదు.. టీబీజేపీ అధ్యక్ష హోదాలో ఉన్న రామచందరరావుతో పాటు మరికొందరు బీజేపీ సీనియర్లు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పటికీ.. బండి లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. కొందరైతే బండి రాక కోసం వెయిట్ చేసిన పరిస్థితి.

ఎన్నికల పోలింగ్ కు ఆరు రోజుల ముందు ప్రచారానికి వచ్చిన ఆయన బోరబండలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. మాజీ మంత్రి కేటీఆర్ ను తన మాటల తూటాలతో తీవ్రంగా టార్గెట్ చేశారు. సంచలన వ్యాఖ్యలు చేసిన బండి ప్రసంగంలోని కొన్ని కీలక వ్యాఖ్యలు చూస్తే.. ఆ పదను ఎంతో అర్థమవుతుంది. అన్నింటికి మించి జూబ్లీ ఉపపోరు ఎజెండానే మార్చే తరహాలో బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు గడిచిన కొద్ది రోజులుగా జూబ్లీ ఉపపోరు ప్రచారంలో రోడ్ షోలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..

- టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా. నేను హిందువును... టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను. జూబ్లిహిల్స్ హిందువులారా... 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండి.

- మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం. గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది. రేవంత్ కు దమ్ముంటే....గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలి.

- కేటీఆర్ కు వావి వరసల్లేవు.... చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకం. కవిత... మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో.

- రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్...వాళ్లతో జాగ్రత్త. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

- లక్ష ఓట్ల కోసం ఒవైసీ సంకుతున్న కాంగ్రెస్. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు. అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా?