Begin typing your search above and press return to search.

ఒక రాహుల్...ఒక లోకేష్.. ఈ పోలిక ఎందుకు ?

ఈ ఇద్దరూ వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని వచ్చిన వారే. ఇది ఇద్దరికీ సంబంధించిన కామన్ పాయింట్.

By:  Satya P   |   23 Jun 2026 9:19 AM IST
ఒక రాహుల్...ఒక లోకేష్.. ఈ పోలిక ఎందుకు ?
X

ఈ ఇద్దరూ వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని వచ్చిన వారే. ఇది ఇద్దరికీ సంబంధించిన కామన్ పాయింట్. అదే సమయంలో ఇద్దరి రాజకీయం అంత సులువుగా ఆమోదం పొందలేదు. ఇద్దరినీ పప్పు అని ప్రత్యర్ధులు చేసిన విమర్శలు కానీ సోషల్ మీడియా వేదికగా చేసిన భీకరమైన ట్రోలింగ్ కానీ చూస్తే ఎవరికీ ఇంతలా జరగలేదే అనిపించకమానదు. ఈ ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించిన సందర్భంలో జరిగిన విషయాలు ఇవి. అయితే ఈ ఇద్దరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ కొనసాగుతున్నారు. ఇక ట్రోల్స్ చేసిన వారి సౌండ్ ఒక దశలో బాగా తగ్గిపోయింది. అదే సమయంలో ఈ ఇద్దరూ తమను తాము రుజువు చేసుకునే క్రమంలో విజయవంతం అయ్యారు. ఈ ఇద్దరూ ఇపుడు రాజకీయంగా రాటు తేలి కనిపిస్తున్నారు.

రాహుల్ తరువాత నేనే :

అసలు రాహుల్ గాంధీకు లోకేష్ కి పోలిక ఎందుకు అన్నది కూడా చర్చగా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అడిగిన దానికి ఆయన బదులిస్తూ రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. తనకు ఆయనకు మధ్య పోలికలతో పాటు తేడాలు చెప్పారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు అంటే దేశంలో రాహుల్ గాంధీ తర్వాత అత్యధికంగా ట్రోల్ చేయబడిన రెండవ వ్యక్తిని నేను అన్నారు. బహుశా ఇంతలా ట్రోల్స్ చేయబడిన వారు తాము తప్ప ఎవరూ లేరని కూడా ఆయన అన్నారు. అయితే సోషల్ మీడియాలో చూపించిన విషయాలు కానీ తరచుగా అక్కడ చర్చించే విషయాలు మనం నేరుగా చూసినంతగా ఉండవని లోకేష్ అన్నారు. అంతే కాదు తెలియని వారు చేసే ట్రోలింగ్స్ గా కూడా చెప్పారు. వాస్తవాలు తరువాత బయటకు వచ్చినపుడు ఈ ట్రోలింగ్స్ అన్నవి కొట్టుకుని పోతాయని కూడా అన్నారు.

ఉద్దేశ్యపూర్వకంగా :

ఇక తన రాజకీయ జీవితం ఆరంభించినపుడు ఉద్దేశ్యపూర్వకంగా ట్రోల్స్ చేశారు అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇవి తన అనుభవాలు అని ఆ ఇంటరాక్టివ్ సెషన్ లో ఆయన మనసు విప్పి చెప్పుకున్నరు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో తనపై ప్రతికూల కథనాలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పించారు అని రాహుల్ గాంధీ అన్నారు. అది ఏదో యధాలాపంగా జరగలేదని వ్యవస్థీకృత రాజకీయ ప్రచారాలుగానే జరిగాయని ఆయన ప్రస్తావించారు. అయితే ట్విట్టర్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విషయాలను చిత్రీకరించే విధానానికి వాస్తవానికి తరచుగా చాలా తేడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తేడా కూడా ఉంది :

ఇక రాహుల్ గాంధీ కి తనకు తేడా కూడా లోకేష్ చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తనకు ఎంతో కొంత స్పూర్తి ఇచ్చిందని అయితే తాను చేసిన పాదయాత్రను అక్కడితో వదిలేయలేదని దానిని పుస్తక రూపంలో తీఉస్కుని వచ్చాను అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీకి తాను సలహాలు ఇవ్వడం లేదు కానీ ప్రజల మధ్య ఉన్నపుడు చూసిన విషయాలను మమేకమైన అంశాలను సదా మననం చేసుకుని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని అన్నారు. మొత్తానికి చూస్తే లోకేష్ చాలా వినయంగా తన గురించి చెప్పుకుంటూనే రాహుల్ గాంధీ గురించి కూడా బాగానే చెప్పుకొచ్చారు. అంతే కాదు ట్రోలింగ్ తమ మీద ఎక్కువగా జరిగింది అంటూ ప్రత్యర్ధుల విషయం కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ ఈ రోజు లీడర్ ఆఫ్ అపొజిషన్ గా కేంద్రంలో ఉన్నారు. లోకేష్ ఏపీలో రైజింగ్ పొలిటికల్ స్టార్ గా ఉన్నారు. మరి ట్రోలర్స్ కి వీరి ఎదుగుదల సరైన జవాబు చెప్పిందని అనుకోవాల్సిందే.