ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉందిగా... అప్పుడు చూసుకుంటాం...!
పార్టీలు ఏవైనా కొంత మంది నాయకుల తీరు మాత్రం ఒకే తరహాలో ఉండడం గమనార్హం. అధికార పార్టీల కు.. ప్రతిపక్ష పార్టీకి కూడా ఈ వ్యవహారం ఇబ్బందిగానే ఉంది.
By: Garuda Media | 7 Nov 2025 4:00 AM ISTపార్టీలు ఏవైనా కొంత మంది నాయకుల తీరు మాత్రం ఒకే తరహాలో ఉండడం గమనార్హం. అధికార పార్టీల కు.. ప్రతిపక్ష పార్టీకి కూడా ఈ వ్యవహారం ఇబ్బందిగానే ఉంది. ప్రజలకు చేరువ కావడం అనేది నాయకు ల ధర్మం.ఈ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. నాయకుడు ఇంట్లో కాదు.. ప్రజల మధ్య ఉండాలన్నది పొలిటికల్ ఫార్ములా కూడా. అలా ఉన్నప్పుడే.. ప్రజలకు చేరువయ్యారు. విజయం దక్కించుకున్నారు. కానీ.. ఈ ఫార్ములాను కొందరు మరిచిపోతున్నారు.
టీడీపీలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక, వైసీపీలోనూ ఇలానే వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నాయకులు ప్రజలకు చేరువ కాలేదంటే.. ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో దక్కిన ఘోర పరాభవాన్ని వారు మరిచిపోలేక పోతున్నారని సరిపుచ్చుకునే అవకాశం ఉంటుం ది. అయినా.. వారు కూడా ప్రజలకు చేరువ కావాల్సి ఉంది. ఎందుకంటే.. ఓటమి ఎదురై 16 మాసాలు గడిచిపోయాయి. ఇంకా అలానేఉంటామంటే కష్టం.
ఇక, టీడీపీ నాయకులకు మరింత బాధ్యత ఉంటుంది. అధికారంలో ఉండడం.. మరోసారి విజయం ద క్కించుకోవాలన్న లక్ష్యం కనిపిస్తుండడం... వచ్చే ఎన్నికల నాటికి పోటీ మరింత తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ.. ఈ విషయంలో వైసీపీ , టీడీపీ నేతల మాట దాదాపుగా ఒక్కలానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. టీడీపీ , వైసీపీలో కొందరు మాత్రం పక్కాగా పనిచేస్తున్నారు.
మిగిలిన వారిలో ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు.. మాత్రం ఎన్నికల వరకు వెయిట్ చేస్తామన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఇంకా.. ఇప్పుడే కదా.. సర్కారు వచ్చింది.. మరో మూడేళ్లకు పైగానే సమయం ఉంది కదా.. ! అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇక, వైసీపీలో దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇప్పటి నుంచి ప్రజల మధ్య ఉంటే ఖర్చు చేయాలని.. ఇంత చేసినా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారో అన్నది సందేహమేనని చెబుతున్నారు. దీంతో 50 శాతం మంది నాయకులు ఇంటికే పరిమితం కావడం గమనార్హం.
