పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందా ?
పీఓకేలో ఇపుడు మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో పాక్ సైన్యం ఆ నిరసనలను నిర్ధాక్షిణ్యంగా అణచేస్తోంది.
By: Satya P | 4 Oct 2025 9:06 AM ISTపీఓకేలో ఇపుడు మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో పాక్ సైన్యం ఆ నిరసనలను నిర్ధాక్షిణ్యంగా అణచేస్తోంది. వెనక్కి తగ్గేది లేదని పీఓకేలో లో ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలు అయినా ఇస్తామని వారు తెగిస్తున్నారు. దాంతో పాక్ సైన్యం కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. పీఓకేలో ప్రస్తుతం ఆరని చిచ్చుగా రగులుతోంది. హింసా కాండ ప్రబలిన నేపథ్యంలో పది మంది దాకా నిరసనకారులు మరణించారు అని అంటున్నారు
భారత్ తీవ్ర స్పదన :
పీఓకేలో లో హింసాకాండ పాక్ సైన్యం దారుణంగా వ్యవహరిస్తున్న తీరు మీద భారత్ తీవ్రంగానే స్పందిస్తోంది. ఇంతకంటే క్రూరత్వం ఉండదని భారత్ మండిపడుతోంది. పీఓకేని ఆనాడు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్న పాక్ అక్కడ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజల నోట్లో మట్టి కొడుతోదని భారత్ విమర్శిస్తోంది ఫలితంగానే పీఓకేలో లో ఇపుడు నిరసనలు వినిపిస్తున్నారని అంటోంది. అయినా సరే ఆయుధాలతో తమ భయంకరమైన నైజంతో ఈ నిరసనలను ఆపాలని చూస్తున్నారని పాక్ మీద నిప్పులు చెరిగింది.
కీలక డిమాండ్లతో :
ఇదిలా ఉంటే తమకు సంబంధించి 38 డిమాండ్లతో పీఓకేలో ఆందోళనకారులు ఉద్యమిస్తున్నారు. శుక్రవారం నాటికి వారి ఆందోళనలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లను సాధిస్తామని వారు వీధుల్లోకి వచ్చి మరీ పోరాడుతున్నారు. మరో వైపు పాక్ ప్రభుత్వం అణచివేతనే నమ్ముకుంది. ఈ నిరసనలలో అధిక సంఖ్యలో పీఓకే ప్రజలు గాయపడ్డారు దీంతో అక్కడ రణ రంగంగా మారుతోంది.
మానవ ఉల్లంఘన అంటూ :
ఈ నేపధ్యంలో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్ వైఖరిని దుయ్యబెట్టారు. పీఓకేలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల వల్ల , అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతోందని పాక్ బలగాల దౌర్జన్యాలపై వచ్చిన నివేదికలను తాము పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలిపారు. పాక్ తన చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను పీఓకేలో కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ సాగుతోందని దానికి పూర్తి బాధ్యత పాక్ దే అన్నారు
పీఓకే స్వాధీనమా :
పీఓకేలో నిరసనకారులు ప్రపంచం తమవైపు చూడాలని ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే భారత్ మాత్రమే పక్కన ఉంది. గతంలో కూడా వారు భారత్ తమ పట్ల సానుకూలంగా ఉండాలని కోరారు. ఇపుడు ఏకంగా ఆందోళనలే జరుగుతున్నాయి. పాక్ ఎటూ వారి డిమాండ్లను పరిష్కరించదు. ఈ క్రమంలో భారత్ పీఓకే నిరసనకారుల పక్షం వహిస్తోంది. మరి ఇది మరింతగా ముందుకు సాగి భారత్ లో పీఓకేని విలీనం చేస్తారా అన్నది చర్చగా ఉంది. ఆపరేషన్ సింధూర్ టైం లోనే పీఓకే ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. ఇపుడు అంతర్జాతీయ సమాజం కూడా ఆలోచించే విధంగా పీఓకేలో పాక్ దౌర్జన్యాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పీఓకేకి సంఘీభావంతో భారత్ సరిపెడుతుందా ఏమైనా వ్యూహం ఉందా అన్నది చూడాల్సి ఉంది.
