ఎంత మంది ఉన్నా.. సోషల్ మీడియాలో మోడీదే హవా!
సోషల్ మీడియాలో అనేక మంది ప్రముఖులు, నటులు, రాజకీయ నేతలు.. చాలా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
By: Garuda Media | 20 Dec 2025 12:11 AM ISTసోషల్ మీడియాలో అనేక మంది ప్రముఖులు, నటులు, రాజకీయ నేతలు.. చాలా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుంచి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దాకా చాలామంది వెంటనే స్పందిస్తారు. అనేక కొత్త విషయాలను కూడా పంచుకుంటున్నారు. వీరికి కూడా లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఎంత మంది ఉన్నా.. ఎంత మంది ప్రముఖులు యాక్టివ్‌గా కనిపించినా.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే మరోసారి రికార్డు సృష్టించారు. సోషల్ మీడియాలో ఆయనదే హవా కనిపించినట్టు `ఎక్స్` రిపోర్టు తాజాగా వెల్లడించింది.
గడిచిన 30 రోజుల్లో
గడిచిన 30 రోజుల్లో భారత దేశంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యవహారాలను `ఎక్స్` వివరించింది. వీరిలో ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నారని తెలిపింది. 10 పోస్టుల్లో 8 పోస్టులు.. ఆయన చేసినవే ముందు వరుసలో నిలిచాయని.. మిలియన్ల మంది వీక్షకులు లైకులు కొట్టారని.. ఫార్వార్డ్ చేశారని కామెంట్లు కుమ్మరించారని తెలిపింది. ఈ పోస్టుల్లో ఫారిన్ టూర్స్ సహా.. సర్కారు కార్యక్రమాలు కూడా ఉన్నాయని.. పలు పథకాలకు సంబంధించి.. పలువురు వ్యక్తులకు సంబంధించిన పోస్టులు కూడా ప్రధాని చేసినట్టు ఎక్స్ వెల్లడించింది. భారీ సంఖ్యలో లైకులు సాధించిన 10 ట్వీట్లలో 8 ట్వీట్లు ప్రధానివే ఉన్నాయని.. తెలిపింది.
ఇదీ.. జాబితా..
+ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారతకు వచ్చినప్పుడు.. ప్రధాని మోడీ ఆయనకు రష్యా బాషలో ఉన్న భగవద్గీతను కానుక గా ఇచ్చారు. ఈ పోస్టును 67 లక్షల మంది చూశారు. 2 లక్షల మంది లైక్ చేశారు.
+ పుతిన్ పర్యటనకు సంబంధించి చేసిన పోస్టులను కూడా ఇదే సంఖ్యలో ప్రజలు వీక్షించినట్టు తెలిపింది.
+ వేదమూర్తి దేవవ్రత్ గురించి ప్రధాని మోడీ చేసిన పోస్టును కూడా 60 లక్షల మంది వీక్షించారు.
+ ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మ భూమి, అయోధ్యలో ఉన్న రామాలయంలో గత నెలలో ధ్వజారోహణ చేశారు. ఈ పోస్టుకు కూడా.. 60 లక్షల మంది చూశారని.. 1.5 లక్షల మందికి పైగా లైక్ చేశారని తెలిపింది.
+ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు వెడ్డింగ్ గ్రీటింగ్స్ చెప్పినప్పుడు..
+ టీ20 వరల్డ్ కప్‌లో అంధ మహిళల జట్టు విజయం సాధించినప్పుడు..
+ మోడీ ఒమన్ పర్యటనకు వెళ్లినప్పుడు సత్కారం పొందిన పోస్టులకు కూడా లక్షల మంది నుంచి వీక్షణ లభించిందని ఎక్స్ వెల్లడించింది. మొత్తంగా ప్రధాని మోడీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారని స్పష్టం చేసింది.
