Begin typing your search above and press return to search.

విద్యార్థుల ప్రశ్నలు, మోడీ సమాధానాలు.. బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్స్ ఇవే!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 9వ పరీక్షా పే చర్చ - 2026 రెండవ ఎపిసోడ్ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు.

By:  Raja Ch   |   9 Feb 2026 3:53 PM IST
విద్యార్థుల ప్రశ్నలు, మోడీ సమాధానాలు.. బెస్ట్  ట్రావెల్  డెస్టినేషన్స్  ఇవే!
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 9వ పరీక్షా పే చర్చ - 2026 రెండవ ఎపిసోడ్ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఎగ్జామ్ సీజన్ లో యువ మనస్సులను మార్గనిర్దేశం చేయడానికి తన ప్రయత్నాన్ని కంటిన్యూ చేశారు. కాగా ఫిబ్రవరి 6న దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ లో.. పరీక్షలు, ఒత్తిడి, వ్యక్తిగత వృద్ధిపై దృష్టి సారించగా.. తాజా సెషన్ లో లోతైన ప్రశ్నలతో కూడిన చర్చ జరిగింది.

అవును... ఫిబ్రవరి 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ రెండో ఎపిసోడ్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిస్తూ... బట్టీ పట్టకుండా నేర్చుకోవడం కంటే ఎక్కువగా పరీక్షలను చూడాలని సూచించారు! ఆన్ లైన్ లో మిగిలినవాటిపై దృష్టి తగ్గించి.. అభిరుచులను ఉపయోగకరమైన నైపుణ్యాలుగా మార్చుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించారు. ఇదే క్రమంలో... విద్యార్థులు గ్రూప్ స్టడీలను ప్రయత్నించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు!

ఈ సందర్భంగా రోజువారి జీవితం, కెరీర్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం గురించి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా... సాంకేతికతకు భయపడాల్సిన అవసరం లేదని.. మనం ఏఐ లేదా మొబైల్ ఫోన్ ని మాస్టర్ గా చేయకూడదని.. మనం ప్రయత్నిస్తే ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకోగలమని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా. కొంతమంది పిల్లలు చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఆహారం తినరని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో.. ఐదు ట్రావెల్ డెస్టినేషన్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ... ముందుగా మన సొంత ప్రాంతాలపై దృష్టి పెట్టాలని.. ఇందులో భాగంగా.. మీ జిల్లా, సిటీ, రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల జాబితాను రాసుకోవాలని.. ఆ తర్వాత ఎక్కడెక్కడి వెళ్లాలో ఎంచుకోవాలని సూచించారు. ముందుగా మన సమీపంలో ఉన్న ప్రాంతాల విశిష్టతను తెలుసుకుంటే, అది భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.

ఇదే క్రమంలో... మంచి నాయకుడిగా ఎదగాలంటే అనే ప్రశ్నకు స్పందించిన ప్రధాని... మన విధివిధానాలకు ఎప్పటికీ భయపడకూడదని.. నిబద్ధతతో పనిచేయాలని.. నికడగా సరైన పని చేయడమే నిజమైన నాయకత్వమని.. మీ ఆలోచనలను కనీసం పది మందికైనా స్పష్టంగా తెలియజేయగలగడమే లీడర్ షిప్ కు అవసరమైన ముఖ్యమైన లక్షణమని తెలిపారు. ఈ సందర్భంగా... విద్యార్థులు చదువుతో పాటు జీవితాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నారు.

కాగా... 2018లో న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఎంపిక చేసిన వ్యక్తులతో ప్రధాని సంభాషించినప్పుడు పరీక్షా పే చర్చ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విస్తృత ప్రేక్షకులను చేరుకుంటున్న ఈ కార్యక్రమంలో 2026లో సుమారు నాలుగున్నర కోట్ల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. వీరిలో సుమారు 4.19 మంది విద్యార్థులు.. సుమారు పాతిక లక్షల మంది ఉపాధ్యాయులు.. 6.15 లక్షల మందికి పైగా తల్లితండ్రులు ఉన్నారు.