Begin typing your search above and press return to search.

సంక్షోభాన్ని ఇలా ప‌రిష్క‌రిద్దాం.. ప్ర‌ధాని సందేశం

ప్ర‌స్తుతం ఇంకా కొన‌సాగుతున్నాయి. వీటికి ప్ర‌తిప‌క్షాలు సైతం తోడ‌య్యాయి. దీంతో కేంద్ర స‌ర్కారుకు భారీగానే సెగ‌త‌గులుతోంది.

By:  Garuda Media   |   23 July 2026 10:00 PM IST
సంక్షోభాన్ని ఇలా ప‌రిష్క‌రిద్దాం.. ప్ర‌ధాని సందేశం
X

వైద్య విద్యా ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష తాలూకు ప్ర‌శ్న ప‌త్రం లీక‌వ‌డం.. అనంత‌రం.. ప‌లువు రు విద్యార్థులు ఆందోళ‌న‌తో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డడం వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో విద్యార్థు లు, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ప్ర‌స్తుతం ఇంకా కొన‌సాగుతున్నాయి. వీటికి ప్ర‌తిప‌క్షాలు సైతం తోడ‌య్యాయి. దీంతో కేంద్ర స‌ర్కారుకు భారీగానే సెగ‌త‌గులుతోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క ప్ర‌తిపాద‌న‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఓ కీల‌క సందేశం ఇచ్చారు. నీట్ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీకి సంబంధించిన నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్టు చేశామ‌ని పేర్కొన్నా రు. వీరిని విచారించేందుకు.. త్వ‌రిత‌గ‌తిన తీర్పులు వెలువ‌రించి.. క‌ఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలో కేవ‌లం వీటి కోస‌మే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

త‌ద్వారా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించిన‌ట్టు అవుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు. అంతేకాదు.. విద్యా వ్య‌వ స్థ‌లో ఎక్క‌డా చిన్న పొర‌పాటు రాకుండా ఉండేందుకు ఈ విధానం స‌రైన మార్గంగా దిశానిర్దేశం చేస్తుంద ని కూడా ఆయ‌న తెలిపారు. దేశంలోని యువ‌శ‌క్తికి హాని చేసేవారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలేది లేద‌ని.. ఆయ‌న తన‌దైన శైలిలో పేర్కొన్నారు. విద్యార్థులు, యువ‌త ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు నిరంత‌రం కృషి చేస్తామ‌న్నారు.

వాస్త‌వం ఏంటి?

అయితే.. వాస్త‌వం ఏంటి? ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఇప్ప టి వ‌ర‌కు ప‌ట్టుకున్న వారిలో నిందితుల గురించి విద్యార్థులు ప్ర‌శ్నించ‌డం లేదు. అస‌లు త‌ప్పు జ‌ర‌గ కుండా చూడాల్సిన కేంద్ర ప్ర‌భుత్వ జ‌వాబుదారీ త‌నం గురించే ప్రాధ‌మిక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీనిని వ‌దిలేసిన ప్ర‌ధాన మంత్రి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా న్యాయం చేస్తామ‌ని చెబుతున్నారు. దీనిని కొంద‌రు స్వాగ‌తించినా.. ప్ర‌ధానంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విద్యార్థులు స‌హా.. కాక్రోచ్ జ‌నతా పార్టీ కార్య‌కర్త‌లు మాత్రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకే ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, ప్ర‌ధాని ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. మిగిలిన‌ సంగ‌తులు మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.