Begin typing your search above and press return to search.

'కాక్రోచ్' ఎఫెక్ట్‌.. మోడీని వ‌ద‌ల‌ట్లేదా?!

రెండు రోజుల కింద‌ట‌.. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని.. ఇలానే యువ‌త‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆవేశా నికి గురి కాకూడ‌ద‌ని చెప్పారు. ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.

By:  Garuda Media   |   12 Aug 2026 5:07 PM IST
కాక్రోచ్ ఎఫెక్ట్‌.. మోడీని వ‌ద‌ల‌ట్లేదా?!
X

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. జెన్ జీని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని కొన్ని విష‌యాల్లో షార్ట్ క‌ట్స్ ప‌నిచేయ‌వని ఆయ‌న తేల్చి చెప్పారు. ముఖ్యంగా ప్ర‌స్తుత ప్ర‌పంచం రీల్స్ చుట్టూ తిరుగుతోంద‌ని చెప్పిన మోడీ.. వాటి వ‌ల‌లో చిక్కుకోవ‌ద్ద‌న్నారు. అలానే.. స‌మ‌స్య ఏదైనా కూడా షార్ట్ క‌ట్ జోలికి పోకుండా.. వాటిని స‌జావు మార్గంలో ప‌రిష్క‌రిం చుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాసిన ఆత్మ క‌థ పుస్తకాన్ని బుధ‌వారం ఢిల్లీలో ఆవిష్క‌రించిన ప్ర‌ధాని.. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రెండు రోజుల కింద‌ట‌.. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని.. ఇలానే యువ‌త‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆవేశా నికి గురి కాకూడ‌ద‌ని చెప్పారు. ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రీల్స్ వ‌ల‌లో చిక్కుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. త‌ద్వారా షార్ట్ క‌ట్ లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు కోవా ల‌న్న ధ్యాస‌లో యువ‌త ముందుకు సాగుతోంద‌ని చెప్పారు. దీనివ‌ల్ల తాత్కాలిక ఫ‌లితాలు వ‌చ్చినా.. ప్ర‌యోజనాలు మాత్రం ఆశించిన‌ట్టుగా ఉండ‌బోవ‌ని వ్యాఖ్యానించారు.

`యువ‌త దేశ నిర్మాత‌ల గురించి చ‌దువుకోవాల‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. వారు జీవితంలో ఎంత క‌ష్ట‌ప‌డ్డారు.. ఎన్ని మెట్లు ఎక్కి ఈ స్థితికి చేరుకున్నార‌న్న విష‌యాల‌ను చ‌దివి.. వాటి నుంచి స్ఫూర్తి పొందాల‌ని కోరారు. ఇక‌, ర‌చ‌యి త‌, మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ గురించి కూడా కీల‌క విష‌యాలు చెప్పారు. ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగా ఉన్న స‌మ యంలో తాను క‌లుసుకుంటే.. ప్రొటోకాల్‌ను కూడా ప‌క్క‌న పెట్టి.. తన‌ను కారు వ‌ర‌కు వ‌చ్చి సాగ‌నంపార‌ని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న నిరాడంబ‌ర‌త‌.. విజ్ఞానం ఈస్థాయికి తీసుకువ‌చ్చాయ‌న్నారు.

జెన్‌జీ టార్గెట్‌గా..

ప్ర‌ధాని మోడీ ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ మాట్లాడినా.. ప‌రోక్షంగా జెన్‌జీ గురించే ప్ర‌స్తావిస్తున్నారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న అనంత‌రం.. యువ‌త‌పై కేంద్రం దృష్టిపెట్టింది. ఇటు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉం టూ.. అటు మీడియా ముందు కూడా యువ‌త గురించి మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. కాగా.. రీల్స్ ద్వారా యువ‌త ఉత్తేజ మ‌వుతున్నార‌న్న వ్యాఖ్య‌ల వెనుక కాక్రోచ్‌జ‌న‌తా పార్టీ సోష‌ల్ మీడియా ఉద్య‌మాన్ని కూడా ప్ర‌ధాని ప్ర‌శ్నించిన‌ట్టు అయింది. మొత్తంగా కాక్రోచ్ ఉద్య‌మం ఎఫెక్ట్ ప్ర‌ధానిని వీడ‌డం లేద‌న్న భావ‌న అయితే ఆయ‌న మాట‌ల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది.