మోడీ టూర్ లోనూ వైసీపీ ఫేక్ పైత్యం.... . రంగంలోకి ఇంటెలిజెన్స్
ఒక దేశ ప్రధాని విషయంలో కూడా ఫేక్ ప్రచారం చేస్తారా అన్నదే కూటమి ప్రభుత్వం పెద్దలు అంటున్న మాటగా ఉంది.
By: Satya P | 16 Oct 2025 9:18 PM ISTప్రధాని నరేంద్ర మోడీ కర్నూల్ జిల్లా పర్యటనకు గురువారం వచ్చారు. అయితే మోడీ పర్యటనను కూడా తనదైన ఫేక్ ప్రచారానికి వైసీపీ వాడుకుందని టీడీపీ మండిపడుతోంది. వైసీపీ తీరు మీద పసుపు శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇక ప్రధాని పర్యటన మీద వైసీపీ చేసిన ఫేక్ ప్రచారం విషయంలో ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డాయని అంటున్నారు. ఇది సీరియస్ విషయమని ఏపీలో కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీని వెనక ఎవరేమిటి అన్నది వెలికి తీయాలని పట్టుదలగా ఉందని అంటున్నారు.
ఇంతకీ జరిగిందేంటి :
ప్రధాని మోడీ గురువారం అంతా ఏపీలోనే గడిపారు. ఆయన ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో పూజలు నిర్వహించారు. అంతే కాదు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ప్రధాని పర్యటన సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ ని పాటించింది అని గుర్తు చేస్తున్నారు విపక్షాలను కూడా ఆహ్వానించింది. దాంతో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రధాని మోడీకి స్వాగతం పలికే అవకాశం కలిగింది.
వినతి పత్రం ఇవ్వకుండానే :
ఇక ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి తెర తీయడం పట్ల కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని చెబుతూ ప్రధానికి ఈ విషయంలో వినతిపత్రం ఇచ్చినట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. అంతే కాదు వాల్మీకీలను ఎస్టీలలో చేర్చాలని వినతిపత్రం ఇచ్చినట్లుగా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరినట్లుగా అసత్య ప్రచారానికి పాల్పడుతోందని కూడా కూటమి నేతలు ఆరోపిస్తునారు.
ఇచ్చిన గౌరవం ఇలాగనా :
వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ఎక్కడా ప్రోటోకాల్ కనీస మాత్రంగా పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆనాడు ప్రధాని వచ్చినా ప్రతిపక్షాలను ఆహ్వానించలేదని కూడా చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం తాము విపక్షాలను ఆహ్వానించడమే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా గౌరవిస్తున్నామని భాగస్వామ్యం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే తాము ఇచ్చిన ఈ గౌరవాన్ని వైసీపీ నేతలు అయితే ఏ మాత్రం నిలబెట్టుకోలేక పోతున్నారు అని వారు ఫైర్ అవుతున్నారు.
సాక్ష్యాత్తూ ప్రధానితో :
ఒక దేశ ప్రధాని విషయంలో కూడా ఫేక్ ప్రచారం చేస్తారా అన్నదే కూటమి ప్రభుత్వం పెద్దలు అంటున్న మాటగా ఉంది. ఇవ్వని వినతి పత్రాన్ని చెప్పని మాటలను కూడా చేర్చి జనాలలో తప్పుడు ప్రచారం చేసుకోవడమేంటని వారు మండిపోతున్నారు. ఇదే తీరును వైసీపీ ఎపుడూ చేస్తూ వస్తోందని ఆ పార్టీ తీరుతెన్నులు ఏ విధంగానూ మారేది లేదని పదే పదే నాయకులు రుజువు చేస్తున్నారు అని అంటున్నాఉర్.
కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా :
ఇదిలా ఉంటే ప్రధానికి ఆహ్వానం పలికే కార్యక్రమంలో కూటమి నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారని అయితే వారు వినతిపత్రాలు ఏవీ ఇవ్వలేదని అంటున్నారు. దాంతో కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డాయి. ఈ రకమైన ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా వారు ఇపుడు పరిశీలిస్తున్నారు. ఒక దేశ ప్రధాని విషయంలో ఏమి జరిగినా పక్కాగా ఉంటుంది. ఎవరు కలిశారు, ఏ రకమైన వినతి చేశారు అన్నీ రికార్డు అవుతాయి.
ఇది సీరియస్ మ్యాటర్ :
అలాంటివి తెలిసి కూడా వైసీపీ ఈ తీరున ఫేక్ ప్రచారానికి తెర తీయడం పైగా మెడికల్ వార్ ని కూడా ఇందులో చేర్చి రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలని చూడడం అంటే ఇది సీరియస్ మ్యాటర్ అని కూటమి పెద్దలు భావిస్తున్నారు. దాంతో ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన వారి మీద కూడా ఏమి చేయాలన్న దాని మీద ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ టూర్ సూపర్ డూపర్ సక్సెస్ అయిన వేళ వైసీపీ పనిగట్టుకుని సాగిస్తున్న ఈ ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కూటమి నేతలు కౌంటర్ యాక్షన్ కి సిద్ధపడుతున్నారని అంటున్నారు.
