Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎలా ఉన్నారు.. గులాబీ ఎంపీలతో మోడీ స్పెషల్ నోట్

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. శుక్రవారం పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు.

By:  Garuda Media   |   20 Dec 2025 11:10 AM IST
కేసీఆర్ ఎలా ఉన్నారు.. గులాబీ ఎంపీలతో మోడీ స్పెషల్ నోట్
X

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. శుక్రవారం పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనుల విషయమై ప్రధానితో భేటీ అయ్యేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గులాబీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి.

గులాబీ బాస్ కేసీఆర్ గురించి ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా అడిగారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు. అంతేనా.. తాను అడిగిన విషయాలన్ని ప్రత్యేకంగా ఆయనతో షేర్ చేయాలని చెప్పటం లాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపునకు కారణం కానున్నాయా? అన్న చర్చకు తెర తీసేలా చేసిందంటున్నారు.

సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలన్న వినతిపత్రాన్ని ప్రధాని మోడీకి సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కేంద్రం ద్రష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ప్రధాని మోడీకి గుర్తు చేశారు. ఈ రహదారి విస్తరణ కారణంగా ఆధ్యాత్మిక పర్యాటకం డెవలప్ అవుతుందని తెలిపారు.

బీఆర్ఎస్ ఎంపీల వినతిని స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి వాకబు చేయటం గమనార్హం. కేసీఆర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని.. తాను ఈ విషయాన్ని చెప్పినట్లు కేసీఆర్ కు తెలియజేయాలని గులాబీ పార్టీ ఎంపీలను కోరారు. ఈ మధ్యనే బీజేపీ ఎంపీలతో భేటీ అయిన సందర్భంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్ పీకటం.. తాజాగా కేసీఆర్ గురించి ఆరా తీయటంతో పాటు.. ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన మాటగా ఆయనకు చెప్పాలని చెప్పటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెప్పాలి.