Begin typing your search above and press return to search.

సీజేపీ ఎఫెక్ట్ : వారితో కనెక్ట్ కావాలన్న మోడీ !

సీజేపీకి అంత బలం ఎలా వచ్చింది. అంటే ఏముంది ఇది సోషల్ మీడియా యుగం. అందులో ఉంటే చాలు క్షణాలలో అల్లుకుని పోతారు.

By:  Satya P   |   25 July 2026 9:32 AM IST
సీజేపీ ఎఫెక్ట్ : వారితో కనెక్ట్ కావాలన్న మోడీ !
X

సీజేపీకి అంత బలం ఎలా వచ్చింది. అంటే ఏముంది ఇది సోషల్ మీడియా యుగం. అందులో ఉంటే చాలు క్షణాలలో అల్లుకుని పోతారు. వారూ వీరూ తేడా లేకుండా అంతా కనెక్ట్ అవుతారు. అంతే కాదు సోషల్ మీడియా అంటే ఎక్కువ యూత్ ఉంటారు. మరి ఆ తరంతో కనెక్ట్ కాకపోతే ఎవరికి నష్టం ఎంత నష్టం అన్నది వర్తమాన చరిత్ర చెబుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అని వాట్సాప్ లో పెట్టిన పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం అంటే అది సోషల్ మీడియా మహిమ అన్నది కూడా అందరికీ తెలిసిందే. అదే ఇపుడు బీజేపీలోనూ చర్చ సాగుతోంది.

మంత్రులకు మోడీ ఆరా :

ఇన్‌స్టాగ్రామ్ గురించి కేంద్ర మంత్రులకు మోడీ హిత బోధ చేశారు అని అంటున్నారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో జాతీయ పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. అదే సమయంలో మోడీ మంత్రుల విషయం కూడా ఆరా తీసారని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అన్నది ఎంత మంది వాడుతున్నారు అని మోడీ ప్రశ్నించారని చెబుతున్నారు. దానిలోకి ప్రవేశించండి అంటూ మోడీ కీలక సూచనలు చేసారని చెబుతున్నారు.

యూత్ తో అనుసంధానం :

కేవలం కేవలం ఎక్స్ ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా కేంద్ర మంత్రులు అంతా క్రమం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ వాడాలని మోడీ సూచించారు అని అంటున్నారు. అలా యూత్ కి నేరుగా కనెక్ట్ కావాలని మంత్రులను ప్రధాని మోడీ కోరినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు యువతతో మమేకం కావడానికి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా చేర్చడానికి కేంద్ర మంత్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు అన్నది ఇపుడు ఆసక్తిగా చర్చిస్తున్నారు.

డిజిటల్ వేదికలు అవి :

కేంద్ర మంత్రులు వర్తమానంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. దేశంలోని యువత ఎక్కువగా సమయం గడుపుతున్న డిజిటల్ వేదికలను కేంద్ర మంత్రులు ఏ మాత్రం విస్మరించకూడదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అని అంటున్నారు. ఇక సోషల్ మీడియా వాడకం మీద డిజిటల్ ఫ్లాట్ ఫారాల మీద మోడీ తన మంత్రివర్గ సహచరులకు పలు సలహాలు ఇచ్చారు అని అంటున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా యువతతో నేరుగా కనెక్ట్ కావాలని మోడీ వారికి సూచించారు. దీని వల్లనే యూత్ పల్స్ పట్టుకోగలుతామన్నది మోడీ అభిప్రాయంగా ఉంది.

పవర్ చూపించిన మోడీ :

ఇదిలా ఉంటే అర్ధ రాత్రి మోడీ రిలీజ్ చేసిన ఒక వీడియో పోస్టుకు భారీ స్పందన అయితే లభించింది. బీజేపీ మద్దతుదారులు కాషయాం పార్టీ అనుకూల యువత ఈ వీడిలో పోస్టు పట్ల పాజిటివ్ గా రియాక్టు అవుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. ఇక ఈ వీడియో కోట్లకు పైగా వ్యూస్‌ను లక్షలాది లైక్‌లను సొంతం చేసుకుంది. ఈ విధంగా యువతను నేరుగా సంప్రదించడం ద్వారా వారిలో భరోసా కల్పించే ప్రయత్నం మోడీ చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాని మోదీ తన వీడియోకు వచ్చిన స్పందనలపై స్పందిస్తూ ప్రజలు అందించిన సానుకూల సూచనలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన మరో వీడియో బైట్ ని కూడా తాజాగా రిలీజ్ చేశారు. మరి మోడీ తాను అనుసరిస్తున్నదే మంత్రులకు చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని సూచిస్తున్నారు. మరి ఇదంతా సీజేపీ ఎఫెక్ట్ నా అని విపక్షాలు అయితే సెటైర్లు పేలుస్తున్నాయి.