సౌత్ బ్లాక్ చరిత్ర పుటల్లోకి...సేవాతీర్ధ్ కి మోడీ షిఫ్ట్
సౌత్ బ్లాక్ ఈ మాట వినగానే ఎన్నో గుర్తుకు వస్తాయి. ఈ దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులు సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం నుంచే పాలన సాగించారు.
By: Satya P | 13 Feb 2026 6:00 AM ISTసౌత్ బ్లాక్ ఈ మాట వినగానే ఎన్నో గుర్తుకు వస్తాయి. ఈ దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులు సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం నుంచే పాలన సాగించారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి మొదలు పెడితే పన్నెండేళ్ళ పాటు నరేంద్ర మోడీ ప్రధానిగా సౌత్ బ్లాక్ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఇపుడు సౌత్ బ్లాక్ అన్నది చరిత్ర పుటల్లోకి వెళ్ళబోతోంది. ఈ నెల 13 తో ఈ సౌత్ బ్లాక్ కి గుడ్ బై చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా నిరంచిన సేవా తీర్థ్ లోకి తన ఆఫీస్ ని షిఫ్ట్ చేయనున్నారు.
చివరి కేబినెట్ తో :
ఇక సౌత్ బ్లాక్ లో చివరి కేబినెట్ సమావేశం 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం తరువాత సౌత్ బ్లాక్ నుంచి ప్రధాని ఆఫీస్ పూర్తిగా ఖాళీ అవుతుంది. కొత్తగా నిర్మించిన సేవా పధ్ కాంప్లెక్స్ లోకి ప్రధాని ఆఫీస్ ని మార్చేయనున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని రైసీనా హిల్స్ లో ఉన్న సౌత్ బ్లాక్ ని బ్రిటిష్ కాలంలో నిర్మించారు. అక్కడ ఉన్న ఆఫీసు భవనాలు అన్నీ ఆనాటివే. ఇక నార్త్ బ్లాక్ లో హోం శాఖ ఆఫీస్ ఉండేది, కొంతకాలం క్రితం హోం శాఖ ఆఫీస్ సేవా పధ్ లోకి షిఫ్ట్ అయింది. ప్రధాని ఆఫీసు రేపు షిఫ్ట్ కానుంది.
నరేంద్ర మోడీ చేతుల మీదుగా :
ఇక సేవా పధ్ ఆఫీస్ తో పాటు కర్తవ్య భవన్ 1, 2 లను నరేంద్ర మోడీ 13న ప్రారంభిస్తారు. కొత్త ఆఫీసుల ప్రారంభంతో పాటు సాయంత్రం ఆరు గంటలకు సేవా తీర్థంలో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు. ఇక సేవా పధ్ లో మొత్తం పాలనా వ్యవస్థ అంతా ఒక చోటనే ఉంటుంది. ఒకపుడు ఒక్కో ఆఫీసు ఒక్కో చోట కేంద్రీకృతం అయ్యేది. ఇపుడు సేవాపధ్ లో ప్రధానమంత్రి ఆఫీస్ తో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్. కేబినెట్ సెక్రటేరియట్ వంటివి కలిసే ఉంటాయి. కర్తవ్య పధ్ 1, 2 బ్లాక్ లలో ఇతర కీలకమైన మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి. అలా ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కార్పొరేట్ సర్వీసెస్, విద్య, సంస్కృతి, న్యాయ, సమాచార- ప్రసార, వ్యవసాయ, రసాయనిక, గిరిజన శాఖ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉంటాయి. ఇక ఈ ఆఫీసులు అన్నింటినీ అనుసంధానం చేస్తూ డిజిటల్ ఇంటిగ్రేషన్ వ్యవస్థ ఉండడం విశేషం.
మ్యూజియంగా :
మరి నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ లను ఏమి చేస్తారు అన్న చర్చ ఉంది. అయితే ఇక్కడ భారత నాగరికత సంస్కృతిని పూర్తిగా తెలియచేసేలా యుగే యుగే మ్యూజియం ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నార్త్ బ్లాక్ లో మ్యూజియం పనులు మొదలయ్యాయి. ఇక మీదట సౌత్ బ్లాక్ లో కూడా పనులు స్టార్ట్ చేసి నిర్ణీత గడువులోగా భారత నాగరికత ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో తెలియచేసే అద్భుతమైన మ్యూజియాన్ని జాతికి అందిస్తారు.
