కేంద్ర కేబినెట్ భేటీ...ఆపరేషన్ సింధూర్ 2.0 మీద సీరియస్ ఫోకస్
కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం అయిదున్నర గంటలకు జరగనుంది.
By: Satya P | 12 Nov 2025 9:27 AM ISTకేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం అయిదున్నర గంటలకు జరగనుంది. ఈ భేటీలో అనేక కీలక అంశాలు ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. వాటితో పాటుగా సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో సీరియస్ డిస్కషన్ ఉంటుందని అంటున్నారు.
ఆపరేషన్ సింధూర్ 2.0 :
ఆపరేషన్ సింధూర్ ఎక్కడా ఆగలేదని ఆ ప్రక్రియ నిరంతరం సాగుతుందని ఇప్పటికే రక్షణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు పాకిస్థాన్ విషయంలో భారత్ అలెర్ట్ గా ఉండాలంటే ఈ ఆపరేషన్ తప్పనిసరి అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీని వెనక పాకిస్తాన్ లోని ఉగ్ర మూక అయిన జైషెద్ మహమ్మద్ హస్తం ఉందని అనుమానాలు ఉన్నాయి. దాంతో ఈ విషయం మీద కూడా కేంద్ర కేబినెట్ లో కీలకమైన చర్చ సాగుతుందని అంటున్నారు. ఉగ్ర దాడులు వరసగా గత కొన్నాళ్ళుగా జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహిస్తోంది. దీంతో కొన్ని చోట్ల అరెస్టులు జరిగాయి. వాటి మీద కూడా చర్చ ఉండొచ్చు అని అంటున్నారు. అంతే కాకుండా పహిల్గాం దాడి తరువాత దేశంలో ఉగ్ర కదలికలు ఏ మేరకు పెరిగాయి అన్నది కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.
బీహార్ పోల్స్ మీద :
దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రం బీహార్. పైగా హిందీ బెల్ట్ లో పెద్ద స్టేట్. అక్కడ మార్పు కనుక మొదలైతే అది జాతీయ స్థాయిలో కొత్త సంకేతాలు అందిస్తుంది. అయితే బీహార్ లో తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్నీ కూడా ఎన్డీయేకి పట్టం కట్టాయి. దీని మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ సర్వేల కంటే కూడా ఎక్కువగా తాము గెలిచి తీరుతామని అన్నారు. కేంద్ర మంత్రి మండలి సమావేశం అయిన తరువాత మంత్రుల ఇష్టాగోష్టిలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
పలు కీలక నిర్ణయాలు :
కేంద్ర మంత్రి వర్గ సమావేశం పలు ఇతర అంశాలను కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి వర్గ సమావేశం క్రమ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. కానీ ఈసారి దాని ప్రాధాన్యత ఏంటి అంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అని అంటున్నారు. దాంతో ఆ విషయంలో సీరియస్ స్టెప్స్ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందా అలా చేయాలంటే మంత్రి వర్గంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. వేటి మీద ఫోకస్ పెడతారు అన్నది అయితే కొంత ఆసక్తిగానే ఉంది చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏ రకమైన తీర్మానాలు నిణయాలు చేస్తారో.
