Begin typing your search above and press return to search.

మోడీ చెబుతున్న బ్లూబుక్ ఏంటి?

ఇలాంటి వేళ.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి నుంచి బ్లూ బుక్ పేరు వచ్చిన పరిస్థితి.

By:  Garuda Media   |   17 Nov 2025 12:21 PM IST
మోడీ చెబుతున్న బ్లూబుక్ ఏంటి?
X

రెడ్ బుక్.. బ్లూ బుక్.. ఈ మధ్యన వచ్చిన పింక్ బుక్.. ఇలా ఏ రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న అరాచకాలపై ప్రత్యేక పుస్తకాల్ని పెడుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ షురూ చేసిన రెడ్ బుక్ ను తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు తమదైన పుస్తకాల్ని తెర మీదకు తెస్తున్నాయి. ఇలాంటి వేళ.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి నుంచి బ్లూ బుక్ పేరు వచ్చిన పరిస్థితి. ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? దాని వెనుకున్న ఉద్దేశం ఆసక్తికరమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని పక్కన పెడితే.. ఏదైనా భారీ ప్రాజెక్టులు చేపట్టిన వేళలో.. వాటిని నిర్మించే వేళ ఎదురయ్యే పరిస్థితులను నమోదు చేస్తుంటారు. దీన్ని బ్లూబుక్ గా అభివర్ణిస్తుంటారు.

ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో పని చేస్తున్న ఇంజినీర్లతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పనుల పురోగతిని ఆరా తీసిన ఆయన.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంజినీర్లతో మాట్లాడిన సందర్భంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఎదురైన అనుభవాల్ని నమోదు చేయాలని.. వాటిని బ్లూ బుక్ లా తయారు చేయాలన్న సూచన చేశారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ తరహా ప్రాజెక్టులను తీసుకొచ్చే విషయంలో దేశం నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పదే పదే ప్రయోగాలు చేయకుండా గతంలో ఎదురైన అంశాలతో ముందుకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్నట్లుగా సిబ్బంది ప్రధానమంత్రి మోడీకి తెలిపినట్లుగా ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. తాను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇంజినీర్లతో భేటీ అయిన విషయాన్ని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలోనూ పేర్కొన్నారు.