Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటు మొహం చూడ‌ని మోడీ.. బీజేపీ ఏమందంటే!

ప్ర‌ధాని మోడీ స‌భ‌కు రాక‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై బీజేపీ స్పందించింది. స‌భా నాయ‌కుడిగా ఆయ‌న‌కు స్వేచ్ఛ ఉంద‌ని పేర్కొంది.

By:  Garuda Media   |   28 July 2026 9:00 PM IST
పార్ల‌మెంటు మొహం చూడ‌ని మోడీ.. బీజేపీ ఏమందంటే!
X

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 20 నుంచి ఆగ‌స్టు 13వ తేదీ వ‌ర‌కు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. స‌భా నాయ‌కుడిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌భ‌కు వ‌స్తా ర‌ని.. ఆయ‌న ప‌లు విష‌యాల‌పై స్పందిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. స‌హ‌జంగా స‌భా నాయ‌కుడు స‌భ‌లో ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. స‌భ‌కు మ‌రింత వ‌న్నె వ‌స్తుంది.

కానీ, స‌భ ప్రారంభ‌మైన రెండో వారంలో కూడా మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు పార్ల‌మెంటు గ‌డ‌ప తొక్క‌లేదు. వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలి రోజు వందేమాత‌రం ఆల‌పించేందుకువ చ్చిన ఆయ‌న త‌ర్వాత నీట్ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో సెల్ఫీ వీడియోల‌కే ప‌రిమితం అయ్యారు. ఆ త‌ర్వాత నూత‌న చ‌ట్టం తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. దీనిని తీసుకువ‌చ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిలో ఏముందనేది బ‌హిరంగ ప‌ర‌చ‌లేదు.

పైగా.. స‌భా నాయ‌కుడిగా ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డం.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను, ముఖ్యం గా కేంద్ర మంత్రి రాజీనామా విష‌యాన్నిప్ర‌స్తావించాల్సి ఉన్నా.. ఆయ‌న స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో మ‌ణిపూర్ అల్ల‌ర్లు జ‌రిగిన‌ప్పుడు కూడా మోడీ చివ‌రి రెండు రోజులు మాత్ర‌మే స‌భ‌కు వ‌చ్చా రు. అప్ప‌ట్లో స‌భ 22 రోజులు జ‌ర‌గ్గా.. అల్ల‌ర్ల‌పై స‌భ‌లు అట్ట‌డికాయి. అయినా.. మోడీ స్పందించ‌లేదు. చివరి రెండు రోజులు మాత్ర‌మే వ‌చ్చి త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయారు.

బీజేపీ కామెంట్స్‌..

ప్ర‌ధాని మోడీ స‌భ‌కు రాక‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై బీజేపీ స్పందించింది. స‌భా నాయ‌కుడిగా ఆయ‌న‌కు స్వేచ్ఛ ఉంద‌ని పేర్కొంది. అంతేకాదు.. స‌భ‌లో విప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగించ డం ఆపేస్తే.. అప్పుడు వ‌స్తార‌ని సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. అయితే.. వాస్త‌వం వేరుగా ఉంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌తంలో కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పులను వెలికి తీస్తున్నార‌ని.. వాటిని గుదిగుచ్చి.. ప్ర‌ధాని స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నార‌ని స‌మాచారం. అందుకే ఆయ‌న ప్ర‌స్తుతానికి స‌భ‌కు రావ‌డం లేద‌ని చెబుతున్నారు.