ప్లాస్టిక్ సర్జరీలలో టాప్ దేశాలు ఇవే!.. లిస్ట్ చుస్తే షాక్
ప్రపంచంలోనే జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధికంగా ప్లాస్టిక్ సర్జరీలు జరిగే దేశాల్లో సౌత్ కొరియా మొదటి స్థానంలో ఉంది.
By: Madhu Reddy | 17 May 2026 8:00 AM ISTఅందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, ప్రకృతి ఇచ్చిన రూపాన్ని మార్చుకుని, మరింత పర్ఫెక్ట్‌గా కనిపించడం కోసం ఈ రోజుల్లో చాలా మంది 'ప్లాస్టిక్ సర్జరీ'ల వైపు మొగ్గు చూపుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ తెగ నడుస్తోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో జనాలు ప్లాస్టిక్ సర్జరీలను ఎక్కువగా చేయించుకుంటున్నారు? అసలు ఈ సర్జరీ అంటే ఏంటి? టాప్ లిస్ట్‌లో ఉన్న దేశాల గురించి చూద్దాం..
అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి?:
చాలా మంది 'ప్లాస్టిక్ సర్జరీ' అంటే ప్లాస్టిక్‌తో ఏదో చేస్తారని అనుకుంటారు. కానీ అది తప్పు. గ్రీకు భాషలో 'ప్లాస్టికోస్' అంటే రూపాన్ని మార్చడం లేదా చెక్కడం అని అర్థం. ఇక శరీరంలోని ఏదైనా భాగాన్ని మరింత అందంగా మార్చడానికి కాస్మెటిక్ లేదా ప్రమాదాల వల్ల దెబ్బతిన్న అవయవాలను సరిచేయడానికి రికాన్స్ట్రుక్టీవ్ )వైద్యులు చేసే ప్రత్యేకమైన సర్జరీ ఇది. ముక్కు ఆకారం మార్చడం, పెదవులను లావుగా చేయడం, ముడతలు పోగొట్టడం వంటివి ఇందులో భాగమే.
ప్లాస్టిక్ సర్జరీలలో టాప్-5 దేశాలు ఇవే:
ప్రపంచంలోనే జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధికంగా ప్లాస్టిక్ సర్జరీలు జరిగే దేశాల్లో సౌత్ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి 1000 మందిలో సగటున 8.9 మంది సర్జరీలు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత అర్జెంటీనా (8.81) రెండో స్థానంలో, బ్రెజిల్ (7.62) మూడో స్థానంలో ఉన్నాయి. కొలంబియా (7.26), గ్రీస్ (6.33) దేశాలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాల్లో అందానికి ఇచ్చే ప్రాధాన్యత, అక్కడి కల్చర్ దీనికి ప్రధాన కారణం.
అమెరికా మరియు ఇతర దేశాల ముచ్చట్లు:
అగ్రరాజ్యం అమెరికా ఈ లిస్ట్‌లో 5.91 రేటింగ్‌తో ఆరో స్థానంలో ఉంది. జర్మనీ, టర్కీ, మెక్సికో, ఇటలీ వంటి దేశాలు కూడా టాప్-10 లో చోటు సంపాదించుకున్నాయి. ఆసియా దేశాలైన జపాన్ (2.13), థాయిలాండ్ (1.49), సింగపూర్ (1.2) లలో కూడా ఈ సర్జరీల హవా బాగానే నడుస్తోంది. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా 1.006 రేటింగ్‌తో టాప్ 50 దేశాల లిస్ట్‌లో ఉంది. మరి మన భారతదేశం పరిస్థితి ఏంటో తెలుసా? మన దేశంలో కూడా మెట్రో సిటీలలో ఈ సర్జరీల ట్రెండ్ పెరుగుతోంది, కానీ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పర్ క్యాపిటా రేటింగ్ పరంగా టాప్ లిస్ట్‌లో కనిపించదు.
ఇక ఒకప్పుడు కేవలం సినిమా స్టార్లకే పరిమితమైన ప్లాస్టిక్ సర్జరీలు, ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, బాహ్య సౌందర్యం కంటే మనసు అందం ముఖ్యమని చాలా మంది నమ్మినా, గ్లోబల్ లెవెల్‌లో మాత్రం ప్లాస్టిక్ సర్జరీల మార్కెట్ కోట్ల రూపాయల బిజినెస్‌తో దూసుకుపోతోంది. ఈ టాప్ దేశాల లిస్ట్ చూశాక.. అందం కోసం జనాలు ఎంతలా తపించిపోతున్నారో అర్థమవుతుంది కదూ..
