కాబోయే సీఎం ఆయనే...పిఠాపురం వర్మ సంచలనం
పిఠాపురం వర్మ మరోసారి బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో టీడీపీ తన జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
By: Satya P | 16 April 2026 10:33 PM ISTపిఠాపురం వర్మ మరోసారి బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో టీడీపీ తన జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏపీకి కాబోయే సీఎం అంటూ సంచలన ప్రకటనలు చేశారు. ఇంతకీ వర్మ చెప్పిన ఆ కాబోయే సీఎం ఏమిటి ఆ కధా కమామీషు ఏమిటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్
సీఎం అవడం ఖాయం :
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత బలమైన నేతగా నారా లోకేష్ ఉన్నారని వర్మ చెప్పారు. లోకేష్ పదమూడేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు అని కొనియాడారు. ఆయన వల్లనే 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు. నారా లోకేష్ కంటే సీఎం పదవికి టీడీపీలో ఎవరూ లేరని వర్మ చెప్పారు. లోకేష్ అన్ని విధాలుగా ఎదిగి ఈ రోజున టీడీపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవిని అందుకున్నారు అని అన్నారు. లోకేష్ చంద్రబాబు కుమారుడిగా కాకుండా తన సొంత సత్తాతో ఒక సామాన్య కార్యకర్తగానే ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్నారని అన్నారు.
ఎపుడు చేయాలో తెలుసు :
ప్రతీ పార్టీకి తమ నాయకుడిని ఉన్నత స్థానంలో చూడాలని ఉంటుందని వర్మ అన్నారు. అలా తాము అంతా లోకేష్ ని సీఎంగా చూడాలని అనుకుంటున్నామని వర్మ చెప్పారు. అయితే తమ నాయకుడు చంద్రబాబుకు ఎపుడు ఏ సమయంలో లోకేష్ ని సీఎం గా చేయాలో తెలుసు అని అన్నారు. అంతవరకూ తాము వేచి ఉంటామని చెప్పారు లోకేష్ 2023 లో చేసిన పాదయాత్ర టీడీపీని బలంగా తయారు చేసిందని అంతే కాకుండా ఏపీలో మరోసారి బంపర్ విక్టరీ కొట్టేలా చేసింది అని అన్నారు.
కార్యకర్తల నేత :
అంతే కాకుండా లోకేష్ ని కార్యకర్తల బాగు చూసే నేతగా వర్మ అభివర్ణించారు. కార్యకర్తల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేసిన ఘనత లోకేష్ దే అన్నారు అంతే కాదు లోకేష్ హయాంలోనే టీడీపీ సభ్యత్వం కోటికి చేరుకుందని ఇదంతా యువ నేత సాధించిన విజయమే అని అన్నారు. టీడీపీలో ప్రతీ ఒక్కరూ లోకేష్ సీఎం గా చూడాలని భావిస్తున్నారు అని అయితే చంద్రబాబుదే ఈ విషయంలో కీలక నిర్ణయం అని వర్మ చెప్పుకొచ్చారు.
గతంలో ఒకసారి :
ఇదిలా ఉంటే గతంలో కూడా ఒకసారి లోకేష్ సీఎం అని పిఠాపురం వర్మ గట్టిగా మాట్లాడారు. ఇపుడు మళ్ళీ అదే విధంగా కోరుతున్నారు. వర్మ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ ని పొత్తుల వల్ల కోల్పోయారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. అయితే అదనం సీట్లతో తనకు ఈసారి తప్పకుండా టికెట్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భావి నాయకుడు లోకేష్ కాబోయే సీఎం అంటూ వర్మ కొనియాడడం మీద చర్చ సాగుతోంది. లోకేష్ చంద్రబాబులకు సన్నిహిత నేతగా పేరు పొందిన వర్మ తన రాజకీయాన్ని తన వారసుడి రాజకీయన్ని కూడా లోకేష్ చేతులలో పెడుతున్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.
