వర్మ నోట కొత్త మాట...రెడీనా మరి !
ఇవన్నీ పక్కన పెడితే వర్మకు ఏ నామినేటెడ్ పదవి దక్కలేదు, దాంతో పాటు ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆడియో ఒకటి వైరల్ గా మారింది.
By: Satya P | 16 Oct 2025 10:00 PM ISTపిఠాపురం వర్మ అంటే ఫైర్ బ్రాండ్ అంటారు దగ్గర నుంచి చూసిన వారు. ఆయన రాజకీయం స్టైల్ అలాగే ఉంటుంది. ఆయన రాజకీయ జీవితం తీసుకుంటే టికెట్ దక్కినా దక్కకపోయినా తన దారి రహదారి అంటారు. ఆయన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ అని చెబుతారు. అలాంటి పిఠాపురం వర్మ నోట ఇపుడు సరికొత్త మాట వినిపిస్తోంది. అదే త్యాగం. అవును ఈ పదం వర్మకు సూటు అవుతుందా లేదా అన్నది వేరే డిస్కషన్ కానీ తాను త్యాగరాజ వర్మను అని ఆయన స్పష్టంగా ఫుల్ క్లారిటీతో చెప్పేస్తున్నారు.
ఎందుకలా ఏమిటిలా :
నిజానికి చూస్తే వర్మ పిఠాపురంలో కీలక నాయకుడు. ఆయనకంటూ సెపరేట్ ఓటు బేస్ క్రియేట్ చేసుకున్నారు. దానికి తోడు అన్నట్లుగా బలమైన టీడీపీలో ఆయన నియోజకవర్గం ఇంచార్జిగా ఉంటున్నారు. దాంతో వర్మ బలం రెట్టింపు అన్నది తెలిసిందే. ఇక 2024లో గెలిస్తే వర్మ మంత్రి అన్నది కూడా ఉన్న మాట. కానీ సీన్ మారింది. జనసేన ఎంట్రీ ఇచ్చింది. అది కూడా అధినేత పవన్ రంగంలోకి దిగిపోయారు. ఇక మీదట పిఠాపురం అంటే జనసేన అడ్డా అని జనసేన నేతలు క్లియర్ కట్ గా ఇండికేషన్ కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో వర్మ వర్గంలో అసహనం కూడా మొదలైంది. దాంతో ఒక విధంగా కూటమిలోనే సెగలూ పొగలూ రేగుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలతో పాటు సోషల్ మీడియా వైరల్ గా మారుతూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
మంత్రి గారి ఆడియో వైరల్ :
ఇవన్నీ పక్కన పెడితే వర్మకు ఏ నామినేటెడ్ పదవి దక్కలేదు, దాంతో పాటు ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఆయన పార్టీ క్యాడర్ తో మాట్లాడుతూ వర్మను జీరో చేశారని చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఆయన ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని పార్టీ ఆదేశమని కూడా అందులో మంత్రి చెప్పినట్లుగా ఉంది. ఇదంతా గురువారం పెద్ద ఎత్తున సోషల్ మీడియా వైరల్ అయి పిఠాపురం మరోసారి ఏపీ స్టేట్ వైడ్ న్యూస్ గా మారింది.
రియాక్ట్ అయిన వర్మ :
తాను ఎటువంటి త్యాగానికి అయినా రెడీ అంటూ వర్మ రియాక్ట్ అయ్యారు. ఈసారి ఘాటుగా కాదు, స్మూత్ గానే ఉంది ఆయన టోన్ అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో తనది 23 ఏళ్ల బంధం అని చంద్రబాబుకు తన గురించి బాగా తెలుసు అని కూడా వర్మ అంటున్నారు. తనను గురించి ఎవరు విమర్శించినా పట్టించుకునేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు తన గురించ్ పిఠాపురం ప్రజలకు తెలుసు అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేయాలన్నా చేసి తీరుతాను అంటూ వర్మ ఇచ్చిన ఈ కౌంటర్ లాంటి రియాక్షన్ ఇపుడు మరోసారి రాజకీయ రచ్చగా మారింది. మరి మంత్రి గారి ఆడియోలో అయితే ఏ రకమైన స్టేట్మెంట్ వర్మ ఇవ్వవద్దు అని ఉందిట. కానీ వర్మ తన మీఅ జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చుకునే పనిలోనే ఈ విధంగా ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మంత్రి అవుతారనుకున్న వర్మ త్యాగరాజుగా మారారా అన్నది కూడా ఇంకో వైపు నుంచి జరుగుతున్న చర్చగా ఉంది. చూడాలి మరి పిఠాపురం రాజకీయాలలో మరెన్ని ప్రకటనలు వస్తాయో. ఇంకెన్ని వైరల్ గా మారుతాయో.
