Begin typing your search above and press return to search.

బాబుని నమ్ముకున్న సీనియర్ నేత....గ్యారంటీగా జాక్ పాట్ అంట !

ఆయనే పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పితాని సత్యనారాయణ.

By:  Satya P   |   6 Nov 2025 9:05 AM IST
బాబుని నమ్ముకున్న సీనియర్ నేత....గ్యారంటీగా జాక్ పాట్ అంట !
X

ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన అనుభవం ఉంది. అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వారుగా ఉన్నారు. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పితాని సత్యనారాయణ. ఆయన భారమంతా బాబు మీద వేసి చాలా నిశ్చింతగా ఉన్నారట. బాబుని నమ్ముకుంటే కచ్చితంగా లక్ తనకు దక్కుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. అదే అనుచరులకు కూడా చెబుతున్నారుట.

రెండు సార్లు అందలం :

పిథాని సత్యనారాయణ తొలుత కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఆ విధంగా ఆయన మంత్రి పదవిని అందుకున్నారు. 2014లో ఏపీలో కాంగ్రెస్ ఖతం కావడంతో ఆయన వైసీపీలో చేరుదామని అనుకున్నా చివరికి టీడీపీని ఎంచుకున్నారు. అదే ఆయనకు ప్లస్ అయింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయనకు చంద్రబాబు ప్రభుత్వంలో మంచి మంత్రిత్వ శాఖ దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు వైసీపీ వేవ్ లో చాలా మంది మాదిరిగా ఆయన కూడా ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఇంకో వైపు చూస్తే కనుక 2024 వరకూ ఆయన పార్టీ మారకుండా టీడీపీ పటిష్టత కోసం కృషి చేశారు. ఆ విధేయతే తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

కొత్త ఫేస్ తో :

అయితే 2024 లో మంత్రిగా పితానికి చాన్స్ దక్కాల్సి ఉంది. ఆయన గోదావరి జిల్లాలలో బలమైన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు సీనియర్ గా కూడా ఉన్నారు. కానీ అలా జరగకపోవడానికి కారణం కొత్త ఫేస్ కి చాన్స్ ఇద్దామన్న పార్టీ ఆలోచనే అని అంటున్నారు. అందుకే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తొలిసారి నెగ్గిన వాసంశెట్టి సుభాష్ కి గోల్డెన్ చాన్స్ దక్కింది. అయితే ఆయన పనితీరు పట్ల అధినాయకత్వం ఏమంత సంతృప్తిగా లేదన్న వార్తలు అయితే పితాని వర్గంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి అని అంటున్నారు. దాంతో వారు తమ నాయకుడికి టైం కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారుట.

మార్పులుంటే ష్యూర్ గా :

ఇక మంత్రివర్గంలో మార్పులు ఉంటే కనుక ష్యూర్ గా పితానికి చాన్స్ దక్కుతుందని అనుచర వర్గం ధీమాగా ఉందిట. ఈసారి తీసుకునే మంత్రులు అనుభవం కలిగిన వారు సీనియర్లు అయి ఉంటారని ఒక విధంగా ఎన్నికల టీం ని సెట్ చేస్తారు అని అంటున్నారు. దాంతో పితాని కాబోయే మినిస్టర్ అని వారు అపుడే ఫుల్ హ్యాపీగా ఉన్నారుట. నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రభావితం చేసే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం బాబుకు వీర విధేయుడు సమర్ధుడు అనుభవశాలి అన్న గుర్తింపు ఉండడంతో పితానికి అమాత్య పదవి అదిగదిగో దగ్గరలోనే ఉంది అన్న వార్తలు అయితే ఊరిస్తున్నాయట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.