Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ఇలాకా: ఆచంట ముచ్చ‌ట్లు.. !

అదే విధంగా ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సామాజిక వర్గ సమీకరణలతో పాటు రాజకీయాలను బేరేజ్ వేసుకున్న చంద్రబాబు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించారు.

By:  Garuda Media   |   7 Dec 2025 7:00 PM IST
మాజీ మంత్రి ఇలాకా:  ఆచంట ముచ్చ‌ట్లు.. !
X

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ని ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఇక్కడ అసలు ఆయన ఉన్నారా... లేరా.. అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నా.యి నిజానికి కూటమిలో ఉన్న నాయకులు దూకుడుగా ఉంటున్నారు. రాజకీయంగా కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ఆచంటలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

పితాని స‌త్య‌నారాయ‌ణ ఎవరినీ పట్టించుకోవడం లేదు. ప్రజల మధ్యకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా హాజరు కావడం లేదు అన్న వాదన పితాని సత్యనారాయణ విషయంలో తెర‌ మీదకు రావడం విశేషం. దీనికి కారణం ఏంటి ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి రాగానే మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న వారిలో సత్యనారాయణ ఒక‌రు. గత చంద్రబాబు హయాంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.

అదే విధంగా ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సామాజిక వర్గ సమీకరణలతో పాటు రాజకీయాలను బేరేజ్ వేసుకున్న చంద్రబాబు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే పితాని సత్యనారాయణకు అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో ఈ కార‌ణంగానే ఆయ‌న‌ మౌనంగా ఉంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇలాంటి వాదనకి ఎప్పుడు తెర‌మీదకు వచ్చినా సత్యనారాయణ వెంటనే అలెర్ట్ అవుతున్నారు.

పార్టీ కార్యాలయానికి రావడం కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం చేస్తున్నారు, త‌ర్వాత మళ్ళీ తన దారిన తాను ఉంటున్నారు. మరి ఇలా ఎన్నాళ్ళు ఆయ‌న‌ వ్యవహరిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీ ఆచంటపై ప్రత్యేకంగా అదృష్టయితే పెట్టిన దాఖలాలు లేకపోవడంతో పితానికి పెద్దగా సమస్యలు కనిపించడం లేదనే చెప్పాలి. కానీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీ దృష్టి పెట్టేందుకు రంగం రెడీ చేసుకుంటోంది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. సో.. ఇప్ప‌టికైనా పితాని పొలిటిక‌ల్ యాక్టివిటీ పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.