భారత్‌పై మళ్లీ నోరు జారిన నవారో.. గట్టి కౌంటర్ ఇచ్చిన మస్క్ ‘ఎక్స్’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.
By: A.N.Kumar | 7 Sept 2025 11:21 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికా ఉద్యోగాలకు నష్టం కలుగుతోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు. నవారో వ్యాఖ్యలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (X) ఫ్యాక్ట్ చెక్ చేసి బూస్ట్ చేసింది. నవారోకు గట్టి పంచ్ కౌంటర్ ఇచ్చి ఆయన అబద్దాల నోరు మూయించింది.
-నవారో ఆరోపణలు
పీటర్ నవారో రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై తీవ్ర విమర్శలు చేస్తూ భారత్ కేవలం లాభాపేక్షతోనే రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రష్యాకు డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని, ఇది అమెరికా పన్ను చెల్లింపుదారులపై భారం మోపుతోందని ఆయన అన్నారు. అంతకుముందు కూడా ఆయన భారత్‌పై అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. ఈ యుద్ధాన్ని 'మోదీ యుద్ధం'గా కూడా ఆయన అభివర్ణించారు.
* 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్
నవారో ఆరోపణలను ఎక్స్ బూస్ట్ చేసి ఆయన వాదనలు తప్పుదోవ పట్టించేవి అని పేర్కొంది. భారత్ తన ఇంధన భద్రత కోసం మాత్రమే రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోందని, ఇది పూర్తిగా చట్టబద్ధమైన నిర్ణయం అని ఎక్స్ స్పష్టం చేసింది. భారత్ రష్యా నుండి చమురు కొనడం వల్ల ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించలేదని పేర్కొంది. అమెరికా కూడా రష్యా నుండి యురేనియం వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటుందని గుర్తు చేస్తూ నవారో వ్యాఖ్యలు కపటమైనవి అని ఎక్స్ అభివర్ణించింది.
* భారత్, ఎక్స్ పై నవారో ఆగ్రహం
ఎక్స్ ఫ్యాక్ట్ చెక్‌పై నవారో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్‌ను "చెత్త"గా పేర్కొంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. భారత్ అధిక సుంకాలు అమెరికన్ ఉద్యోగాలను చంపుతున్నాయని, లాభం కోసమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
* భారత్ ప్రభుత్వ స్పందన
నవారో వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం G7 దేశాలు విధించిన ధరల పరిమితి విధానాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విధానం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను స్థిరీకరించడానికి సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా నవారో వ్యాఖ్యలు నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించేవి అని పేర్కొన్నారు.
