Begin typing your search above and press return to search.

ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా ఆర్మీ చీఫ్ వైదొలగింపు.. ఏంటి కథ.. ఏమైంది?

ఇరాన్‌పై కొనసాగుతున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   3 April 2026 12:07 PM IST
ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా ఆర్మీ చీఫ్ వైదొలగింపు.. ఏంటి కథ.. ఏమైంది?
X

ఇరాన్‌పై కొనసాగుతున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ ఆకస్మికంగా తన పదవికి వైదొలగడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి ఉన్నతస్థాయి మార్పులు అమెరికా వ్యూహాత్మక దిశపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనరల్ ర్యాండీ జార్జ్ అమెరికా ఆర్మీలో అత్యున్నత స్థాయి పదవిలో కొనసాగుతూ కీలక బాధ్యతలు నిర్వహించారు. వెస్ట్‌పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టా పొందిన ఆయన సుదీర్ఘ సేవా అనుభవం కలిగిన అధికారి. గల్ఫ్ యుద్ధం నుంచి ప్రారంభించి ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లోనూ కీలక పాత్ర పోషించారు. అలాగే జో బైడెన్ అధ్యక్షత కాలంలో రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు సహాయకుడిగా పనిచేయడం ద్వారా ఆయనకు పరిపాలనా అనుభవం కూడా సంపాదించారు.

అయితే తాజాగా రక్షణ శాఖలో మార్పులు చేపడుతున్న హెగ్సెత్.. సైనిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్, అడ్మిరల్స్‌ను పదవుల నుంచి తప్పించగా జార్జ్ వైదొలగడం ఈ క్రమంలోనే కీలకంగా మారింది. గతంలో కూడా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్‌గా ఉన్న జనరల్ చార్లెస్ బ్రౌన్‌ను తొలగించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఉన్నతస్థాయి అధికారుల ముందస్తు పదవీ విరమణలు, బదిలీలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా అమెరికా దళాల భద్రతను దృష్టిలో ఉంచుకొని రక్షణ మంత్రి హెగ్సెత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల్లో వ్యక్తిగత ఆయుధాలు తీసుకెళ్లేందుకు సైనికులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా సైనికులు తక్షణ రక్షణ చర్యలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వివరిస్తూ విడుదల చేసిన వీడియోలో ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు అవసరమయ్యాయని హెగ్సెత్ స్పష్టం చేశారు.

అయితే ఇరాన్ పై యుద్ధానికి పురిగొల్పారని రక్షణ మంత్రి హెగ్సెత్ పై ట్రంప్ ఆరోపించారు. అసలు ఇరాన్ వార్ స్ట్రాట్ కావడానికి అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ ఉత్సాహమే కారణమని ఆయన చెప్పడం వల్లే వెళ్లినట్టు రక్షణ మంత్రి హెగ్సెత్ నిగ్గు తేల్చారు. ఇరాన్ తో యుద్ధానికి దిగి అమెరికా నిండా మునిగింది. అందుకే దీనికి కారణమైన అమెరికా సైన్యాధిపతిని పదవి నుంచి తొలగించినట్టుగా విశ్లేషఖులు భావిస్తున్నారు.

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్ పరిణామాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు యుద్ధ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. జనరల్ జార్జ్ వైదొలగింపుతో అమెరికా సైన్యంలో తదుపరి నాయకత్వం ఎవరికి దక్కుతుందన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.