Begin typing your search above and press return to search.

ఏపీ జ‌నం టాక్‌: మార్పు కోరుతున్నారా ..?

రాజ‌కీయాల‌కు సంబంధించి జ‌నంలో మార్పు క‌నిపిస్తోందా? జివ్హ‌ కొత్త రుచులు కోరుకుంటున్న‌ట్టుగా.. ప్ర‌జ‌లు కూడా కొత్త నాయ‌క‌త్వానికి ప‌ట్టం క‌ట్టేందుకు రెడీ అవుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   27 Oct 2025 5:00 PM IST
ఏపీ జ‌నం టాక్‌:  మార్పు కోరుతున్నారా ..?
X

రాజ‌కీయాల‌కు సంబంధించి జ‌నంలో మార్పు క‌నిపిస్తోందా? జివ్హ‌ కొత్త రుచులు కోరుకుంటున్న‌ట్టుగా.. ప్ర‌జ‌లు కూడా కొత్త నాయ‌క‌త్వానికి ప‌ట్టం క‌ట్టేందుకు రెడీ అవుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కార‌ణాలు ఏమైనా... గ‌త ఎన్నిక‌ల్లో కొత్త ముఖాల‌ను ప్ర‌జ‌లు గెలిపించారు. అంతేకాదు.. వారికి ఏక‌బిగిన ఓట్లు గుద్దేశారు. ``కొత్త వారైతే.. ప‌నిచేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రావాలి.`` అని చాలా మంది చెబుతున్న మాట‌.

ఇదేదో.. సొంత క‌విత్వం కాదు. తాజాగా కొన్ని ఛానెళ్లు కొన్ని కొత్త నేత‌లు .. ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజ క‌వర్గాలు.. పాత నాయ‌కులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌ధ్య పోలిక పెడుతూ.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కొత్త నాయ‌కుల‌కు.. అనుకూలంగా ఓటేయ‌డం గ‌మ‌నార్హం. అంటే.. రాష్ట్రంలో కొత్త త‌రానికి దాదాపు.. ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. చిత్రం ఏంటంటే.. చాలా మంది చ‌దువుకున్న వారు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నార‌న్న వాద‌న ఉంది.

కానీ, అనంత‌పురం, క‌ర్నూలు, శ్రీకాకుళం, తిరుప‌తి జిల్లాల్లో చ‌దువుకున్న వారు.. బీటెక్‌, ఎంటెక్‌లు చేసిన వారు.. రాజ‌కీయాలలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని ఈ చానెళ్లు వెలుగులోకి తీసు కురావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం.. వెనుక స‌మాజంలో మార్పును కోరుకుంటుండ‌డంతోపాటు.. అధికారం ఉంటే.. వ్య‌వ‌స్థ‌ను బాగు చేయొచ్చ‌న్న స్పృహ కూడా క‌నిపిస్తోంద‌ని చానెళ్లు విశ్లేషిస్తున్నాయి. బ‌హుశ ఈ విష‌యాన్ని టీడీపీ గ‌తంలోనే గుర్తించింది.

ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పెద్ద పీట వేస్తోంది. ఇలా.. ప్ర‌జ‌ల నాడి మార‌డానికి రెండు కార‌ణాలు క‌నిపిస్తు న్నాయ‌ని చానెళ్లు విశ్లేషించాయి.

1) త‌మ‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. నాయ‌కులు చేరువ‌గా ఉంటార‌న్న‌ది కీల‌కం. అదే.. వ‌యోవృద్ధులు.. లేక‌పోతే, నాలుగైదు సార్లు గెలిచిన వారు త‌మ‌కు చేరువ‌గా ఉండ‌డం లేద‌న్న వాద‌న‌ను వారు వినిపిస్తున్నారు.

2) యువ నేత‌లు భ‌విష్య‌త్తుపై చాలా ఆశ‌లు పెట్టుకుంటార‌ని.. త‌ద్వారా.. పార‌ద‌ర్శ‌క విధానాల‌ను.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల దిశ‌గా వారు అడుగులు వేస్తార‌ని చెబుతున్నారు. సొ.. మొత్తంగా ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ మార్పును పార్టీలు అందిపుచ్చుకుంటే.. విజ‌యం ఖాయ‌మ‌న్న‌ది తెలుస్తోంది.