Begin typing your search above and press return to search.

ఒక్క మాటతో చంపేయగలను.. పెమ్మసాని సంచలనం

టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తెలుగు తమ్ముళ్లు పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తారు.

By:  Garuda Media   |   27 March 2026 11:22 AM IST
ఒక్క మాటతో చంపేయగలను.. పెమ్మసాని సంచలనం
X

టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తెలుగు తమ్ముళ్లు పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడు.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రాజకీయ ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వటం కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసినా.. ఘాటు ఆరోపణలు చేసినా తెలుగు తమ్ముళ్లకు చీమ కుట్టినట్లుగా కూడా ఉండదు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఇదో అతి పెద్దబలహీనతగా చెబుతుంటారు. దివంగత మహానేత వైఎస్ విషయంలోనూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలోనో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇందుకు భిన్నమైన ధోరణి ఆ పార్టీ నేతల్లోనూ.. క్యాడర్ లోనూ కనిపిస్తుంది. చంద్రబాబు మీద పార్టీ నేతలకు అభిమానం ఉంటుంది.ఆయన కారణంగానే తాము పదవుల్ని సొంతం చేసుకున్నామన్న విషయం తెలుసు.

అదే సమయంలో చంద్రబాబును అమితంగా ఆరాధించేతత్త్వం పెద్దగా కనిపించదు. చివరకు చంద్రబాబు అరెస్టు అయిన వేళలోనూ.. తెలుగుదేశం పార్టీ నేతల తీరు చూస్తే అయ్యో అనిపించకమానదు. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి.. చంద్రబాబు అరెస్టు తీరును తప్పు పడుతూ ఆయన్ను కలిసేందుకు బయలుదేరారో.. అప్పుడు మాత్రమే టీడీపీ నేతల్లో కాస్తంత చలనం వచ్చిందన్నది చారిత్రక వాస్తవం.

అంతేనా.. హైదరాబాద్ తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగోళ్లు.. మరి ముఖ్యంగా ఐటీకి చెందిన వారు నిరసనలు చేపట్టటం మొదలుపెట్టారో అప్పుడు మాత్రమే ఏపీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బలమైన గళాన్ని వినిపించిన పరిస్థితి. ఎందుకిలా? అంటే ప్రత్యేక కారణం కనిపించదు. అదే సమయంలో తమ అధినేతను అనవసరంగా ఒక మాట మాట్లాడతారా? అంటూవిరుచుకుపడే వీరభక్తులుగా తెలుగు తమ్ముళ్లు కనిపించరు. ఈ లోటును భర్తీ చేసే కొత్త తరం నేతలు ఇప్పుడు పార్టీలో మొదలయ్యారా? అంటే అవునని చెప్పాలి.

తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిస్తే.. తామూ బాడీ షేమింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పటమే కాదు.. ‘‘ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ.. నాకు సంస్కారం ఉంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబుకు దన్నుగా ఈస్థాయిలో విరుచుకుపడిన నేతగా పెమ్మసానిని చెప్పాలి.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మాట్లాడితే ఫర్లేదు కానీ.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం బాగోలేదని స్పష్టం చేయటం గమనార్హం. ‘నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖం గురించి మాట్లాడారు. జగన్ కు ఒకటే చెబుతున్నా. రాజకీయాలు మాట్లాడండి. సబ్జెక్టు మాట్లాడండి. వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. మీరు మాట్లాడే ఆ చంద్రబాబు ముఖమే తెలుగుజాతిని ఈ రోజు ప్రపంచంలో తలెత్తుకునేలా చేసింది’’ అని మండిపడ్డారు.

ఇదే సందర్భంగా జగన్ తీరును తప్పు పడుతూ.. ఆయన మాట్లాడే మాటలను ప్రస్తావిస్తూ విరుచుకుపడిన వైనం ఆసక్తికరంగా మారింది. ‘‘మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడటం విడ్డూరం’’ అంటూ మండిపడిన పెమ్మసాని.. ప్రజావేదికను కూల్చటం మైండ్ సెట్టా? రైతుల పొలాల పాస్ పుస్తకాలపై మీ ఫోటోలు వేసుకోవటం మైండ్ సెట్టా? అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయిన పెమ్మసాని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.