Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి యాక్టివ్.. సీమ వైసీపీ దూకుడేనా.. ?

మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయ‌న అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించిన డీఎస్సీ-2025 వ్య‌తిరేక నిర‌స‌న‌ల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

By:  Garuda Media   |   13 Aug 2026 1:07 PM IST
పెద్దిరెడ్డి యాక్టివ్.. సీమ వైసీపీ దూకుడేనా.. ?
X

మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయ‌న అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించిన డీఎస్సీ-2025 వ్య‌తిరేక నిర‌స‌న‌ల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే.. పోలీసులు ఆయ‌న‌ను మ‌ధ్య‌లోనే అడ్డుకున్నారు. ఈ ప‌రిణామం సీమ వైసీపీలో కొంత జోష్ నింపింద‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా.. పార్టీ ప‌రంగా ఉద్య‌మాలు చేప‌ట్టినా.. పెద్దిరెడ్డి పెద్ద‌గా యాక్టివ్ కాలేదు. కుటుంబంపై న‌మోదైన కేసులు ఆయ‌న‌ను ఇబ్బందికి గురి చేశాయ‌న్న వాద‌న ఉంది.

ముఖ్యంగా భూములు, మ‌ద్యం, అట‌వీ భూమిని ఆక్ర‌మించి ఇల్లు క‌ట్టుకున్నార‌న్న కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే.. వాటిపై పార్టీ ప‌రంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. దీంతో పెద్దిరెడ్డి కినుక వ‌హించార‌ని.. పార్టీలో కూడా అన్య‌మ‌న‌స్కంగా ఆయ‌న ఉంటున్నార‌న్న‌ది కొన్నాళ్ల కింద‌టే చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. తాజాగా .. పెద్ది రెడ్డి మ‌న‌సు మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కేడ‌ర్ బ‌ల హీన ప‌డుతుండ‌డం, నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం స‌మ‌స్య‌గా మారుతున్న నేప‌థ్యంలో ఉద్య‌మాల‌కు హాజ‌ర య్యార‌న్న టాక్ వినిపిస్తోంది.

సీమ‌కు క‌లిసి వ‌స్తుందా..?

పెద్దిరెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. గ‌తంలో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. గ‌త 2024 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించాల‌ని నిర్ణ‌యించారు. కానీ, ఈ త‌ర‌హా రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేదు. దీంతో గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి పెద్దిరెడ్డి మౌనంగా ఉండిపోయారు. ఒక‌వైపు మ‌ద‌న‌ప‌ల్లి ఫైల్స్ త‌గ‌ల‌బ‌డ‌డం, మ‌ద్యం కేసు వెంటాడ‌డం, భూముల వ్య‌వ‌హారంతో తీరిక‌లేకుండా పోయింది. మ‌రోవైపు మ‌రిన్ని కేసులు న‌మోదవుతాయ‌న్న బెంగ కూడా ఆయ‌న‌ను వెంటాడింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో మౌనంగా ఉన్న పెద్దిరెడ్డి.. తాజాగా యాక్టివ్ కావ‌డం కొంత మేర‌కు సీమ‌లో వైసీపీకి క‌లిసి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. పూర్తిస్థాయిలో ఇది కొన‌సాగుతుందా? లేదా? అనేది చూడాలి. కేవలం తాడిప‌త్రి వ‌ర‌కే పెద్దిరెడ్డి రాజ‌కీయంగా ప‌రిమితం అవుతారా? అనేది కూడా సందేహంగా మారింది. అయితే.. ఇది కొంత మేర‌కు సానుకూల ప‌రిణామాల‌ను అందిస్తున్న‌ద‌న్న సంకేతాలు కూడా ఉన్నాయి. సీమ‌లో పెద్ది రెడ్డి వంటి సీనియ‌ర్ యాక్టివ్ కావాల‌ని కోరుకునే వారికి మాత్రం తాజా ప‌రిణామం కొంత మేర‌కు సంతృప్తిని ఇచ్చింద‌ని అంటున్నారు.