Begin typing your search above and press return to search.

ప‌య్యావుల కృషి సూప‌ర్‌ 'స‌క్సెస్‌'

దీంతో అప్ప‌టి నుంచి ప‌య్యావుల స‌భా వేదిక వ‌ద్దే చిన్న టెంటును ఏర్పాటు చేసుకునిగ‌త ఐదు రోజు లుగా అక్క‌డే ఉంటూ.. స‌భ డిజైన్ నుంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ వ‌ర‌కు అన్నీ తానై ఏర్పాట్ల‌ను ప‌ర్యవే క్షించారు.

By:  Garuda Media   |   10 Sept 2025 5:38 PM IST
ప‌య్యావుల కృషి సూప‌ర్‌ స‌క్సెస్‌
X

అనంత‌పురంలో కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన `సూపర్ సిక్స్‌-సూప‌ర్ హిట్` భారీ బ‌హిరంగ స‌భ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ‌ మంత్రి, ఇదే జిల్లాకు చెందిన ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ భుజాన వేసుకున్నారు. వాస్త‌వానికి ఈ స‌భ‌ను విజ‌యవంతం చేసేందుకు సీఎం చంద్ర‌బాబు 10 మందితో కూడిన మంత్రుల క‌మిటీని నియ‌మించారు. దీనిలో ప‌య్యావుల తొలుత స‌భ్యుడు మాత్ర‌మే. కానీ, ఆయ‌న ఆస‌క్తిని గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు.. త‌ర్వాత రెండు రోజుల్లోనే స‌భ నిర్వ‌హ‌ణ పూర్తి బాధ్య‌త‌ను ఆయ‌న‌కే అప్ప‌గించారు.

దీంతో అప్ప‌టి నుంచి ప‌య్యావుల స‌భా వేదిక వ‌ద్దే చిన్న టెంటును ఏర్పాటు చేసుకునిగ‌త ఐదు రోజు లుగా అక్క‌డే ఉంటూ.. స‌భ డిజైన్ నుంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ వ‌ర‌కు అన్నీ తానై ఏర్పాట్ల‌ను ప‌ర్యవే క్షించారు. వేదిక ఏర్పాటు నుంచి స‌భ‌లో ఎవ‌రెవ‌రు ప్ర‌సంగించాల‌నే విష‌యంపై ఆయ‌న క‌స‌ర‌త్తు చేసు కుని.. దాని ప్ర‌కారం స‌భ‌ను నిర్వ‌హించారు. స‌భ‌కు సుమారు 3.5 ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని ముందుగా అంచ‌నా వేసుకున్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత పెరిగిన అంచ‌నాల‌తో సుమారు 5 ల‌క్షల మంది వ‌ర‌కు హాజ‌రైనా.. దానికి త‌గిన విధంగా ఏర్పాట్లు చేశారు.,

అదేస‌మ‌యంలో ఎక్క‌డా ఇబ్బంది లేకుండా.. స‌భ‌ను సంపూర్ణంగా విజ‌యవంతం చేసేలా .. వ్యూహాత్మ కంగా వ్య‌వ‌హ‌రించారు. స‌భ‌లో అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కూడా పయ్యావుల తీసుకున్నారు. ఎక్క‌డెక్క‌డ ఎవ‌రు ఏ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి? స‌భ‌లో ముందు ఎవ‌రు ప్ర‌సంగించాలి? త‌ర్వాత ఎవ‌రు ప్ర‌సంగించాల నే అంశాల‌ను కూడా డైరీ రాసుకుని.. దాని ప్ర‌కారం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు తీసుకువెళ్లారు. అదేస‌మ‌యంలో తాగునీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు. తొలుత ఆహారం వ‌ద్ద‌నుకున్నా.. ప‌య్యావుల జోక్యం చేసుకుని.. ఆహార పొట్లాల‌ను కూడా దాత‌ల నుంచి స్వీక‌రించే ఏర్పాటు చేశారు.

ఇక‌, స‌భ‌కు స్వ‌చ్ఛందంగా వ‌చ్చే కార్య‌క‌ర్త‌ల కోసం.. పార్టీ త‌ర‌ఫున బ‌స్సులు ఏర్పాటు చేశారు. ఎక్క‌డా తొక్కిస‌లాట‌కు అవ‌కాశం లేకుండా.. 500 మందికి ఒక గ్యాల‌రీ చొప్పున ఏర్పాటు చేశారు. గ్యాల‌రీకి.. గ్యాల‌రీ కి మ‌ధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. వ‌లంటీర్ల‌ను వంద‌ల సంఖ్య‌లో మోహ‌రించారు. అసౌక‌ర్యానికి అవ‌కాశం లేకుండా.. ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప్ర‌తి విష‌యాన్ని చాలా నిశితంగా తీసుకున్నారు. ప్ర‌ధానంగా సీమ‌లో నిర్వ‌హించిన రెండో అతి పెద్ద స‌భ కావ‌డంతో(గ‌తంలో మ‌హానాడు నిర్వ‌హించారు-క‌డ‌ప‌లో) దీనిని ప‌య్యావుల పూర్తి బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి స‌క్సెస్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది.