వైసీపీ సీట్లు 11 అయినా... పవన్ షాకింగ్ కామెంట్స్ !
గత ఇరవై నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏపీ దశ దిశను మార్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
By: Satya P | 6 March 2026 7:11 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని నిశితమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ప్రగతిశీలాంగా క్రియాశీలకంగా పనిచేస్తోంది అని చెప్పారు. ఏపీలో గడచిన ఇరవై నెలల పాలనలోనే ఎన్నో కార్యక్రమాలను చేసి చూపించామని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో కూటమి పని తీరుని వైసీపీ తీరుని సరిపోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
బలంగా నమ్ముతున్నారు :
గడచిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారని కానీ ఆ పార్టీ వాయిస్ ఎక్కడా తగ్గడం లేదని పవన్ అన్నారు. వారికి 1100 సీట్లు ఉన్నట్లుగా బిగ్ సౌండ్ చేస్తున్నారు అని ఆయన నిండు సభలోనే చెప్పుకొచ్చారు వైసీపీ వారు తాము ఏదైతే బలంగా నమ్ముతున్నారో దానినే జనం ముందు పెడుతూ రీ సౌండ్ చేస్తున్నారు అని ఆయన అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడిన వాటిలో కానీ వారి వాదనలో కానీ ఎక్కువగా భ్రమలు అసత్యాలు వంటివి ఉన్నా కూడా వారు ఏ మాత్రం తగ్గకుండా వాటినే జనంలోకి తీసుకుని పోతున్నారు అని ఆయన విమర్శనాత్మకమైన ధోరణిలో అన్నారు.
కూటమిలో తీరు ఇలా :
అదే సమయంలో ఏకంగా 164 సీట్లను సాధించి అజేయమైన స్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం అయితే తాము ఎన్నో మంచి పనులు చేసినా చెప్పుకునే స్థితిలో లేకుండా పోతోంది అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన మంచి పనులను కూటమి బలంగా చెప్పుకోలేకపోవడమే విచిత్రం అని పవన్ అన్నారు. అదే సమయంలో వైసీపీ అయితే తాము అనుకున్నది బలంగా జనంలోకి చొచ్చుకుని పోయేలా చేస్తోంది అని ఆయన అంటూ కూటమి తీరు పట్ల ఒకింత అవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధి చేసి కూడా :
గత ఇరవై నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏపీ దశ దిశను మార్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అయినా సరే గట్టిగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని పవన్ అనడం నిజంగా కూటమిలో పెద్ద చర్చకు తెర లేపుతోంది. ఏ ప్రభుత్వం అయినా తాము చేసిన మంచి పనులను జనంలో చెబుతూ ఉండాలి. ప్రచారం చేసుకోవాలి. లేకపోతే ఇపుడు ఉన్న ఇంటర్నెట్ యుగంలో జనం బిజీగా ఉన్న కాలంలో ఏ పధకం అయినా కార్యక్రమం అయినా ఎవరికీ గుర్తుండే అవకాశం ఉండదని అంటున్నారు.
ఎలా అర్ధం చేసుకోవాలి :
పవన్ వైసీపీని పైకి విమర్శించినట్లు అనిపించినా లోపల ఆ పార్టీ నేతలకు కమిట్ మెంట్ ఉందని చెప్పకనే చెప్పారు. వారు ఏది అనుకుంటున్నారో దానిని జనంలో పెడుతున్నారు. వారి మెదళ్ళలో చొప్పిస్తున్నారు అదే కూటమిలో ఎంతో మంది నేతలు సీనియర్లు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఉన్నా కూడా సరిగ్గా ప్రభుత్వ విజయాలను ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన అయితే పవన్ లో ఉంది అని అంటున్నారు. మరి దీనిని పాజిటివ్ గా కూటమి నేతలు అంతా తీసుకుంటేనే ప్రభుత్వం వాయిస్ మరింత బలంగా జనంలోకి వెళ్తుంది అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీని ఎపుడూ విమర్శించే పవన్ ఆ పార్టీ నేతలు ఏది చెప్పాలనుకున్నా అందులో నిబద్దహ్త చిత్తశుద్ధితోనే ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారన్న విశ్లేషణ ఉంది. కూటమి ఈ హిత బోధలను తీసుకోవాల్సిందే.
