Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వ్యూహాల‌ను మ‌లుపుతిప్పిన 'కార్య‌క‌ర్త మాట‌'

2018, అక్టోబ‌రులో తిత్లీ తుఫాను ఉత్త‌రాంధ్ర‌ను అత‌లాకుత‌లం చేసిన‌ప్పుడు.. ప్ర‌జ‌లు స‌ర్వం కోల్పోయా రు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు.

By:  Garuda Media   |   4 Sept 2026 1:00 AM IST
ప‌వ‌న్ వ్యూహాల‌ను మ‌లుపుతిప్పిన కార్య‌క‌ర్త మాట‌
X

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఉంటారు. కార్య‌క‌ర్త‌లూ ఉంటారు. అయితే, స‌హ‌జంగా నాయ‌కుల మాట‌కు ఉన్న వాల్యూ.. కార్య‌క‌ర్త‌ల మాట‌కు ఉండ‌దు. వారిని కేవ‌లం జెండాలు మోసే వారిగానే ప‌రిగ‌ణించే పార్టీలు ఉన్నాయి. అదే 2024లో వైసీపీని భారీగా దెబ్బ‌తీసింది. నాడు కార్య‌క‌ర్త‌ల మాట విని ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని.. నాయ‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు. అయితే.. అన్ని పార్టీలూ అలా ఉండ‌వు. ఇప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌ల మాట వింటామ‌ని ముందుకు వ‌స్తోంది.

అయితే.. కూట‌మిలో భాగ‌స్వామ్య పార్టీగా ఉన్న‌ జ‌న‌సేన ఎప్ప‌టి నుంచో కార్య‌క‌ర్త‌ల మాట‌కు వాల్యూ ఇస్తోంద‌న్న విష‌యం తాజాగా వెలుగు చూసింది. ``ఒక కార్య‌క‌ర్త‌.. ఒకే ఒక్క కార్య‌క‌ర్త చెప్పిన మాట‌.. ప‌వ‌న్ హృద‌యాన్ని క‌దిలించింది.`` అని పార్టీ రాష్ట్ర వ్యవాహారాల ఇంచార్జ్‌.. నాదెండ్ల మ‌నోహ‌ర్ చేసిన వ్యాఖ్య‌.. గ‌తంలో ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చింది. దీనిని బ‌ట్టి పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌కు జ‌న‌సేన‌.. అధినేత ఇస్తున్న‌వాల్యూను తేల్చి చెప్పిన‌ట్టు అయింది.

నాడు ఏం జ‌రిగింది?

2018, అక్టోబ‌రులో తిత్లీ తుఫాను ఉత్త‌రాంధ్ర‌ను అత‌లాకుత‌లం చేసిన‌ప్పుడు.. ప్ర‌జ‌లు స‌ర్వం కోల్పోయా రు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప్ర‌తి ఇంటికీ పాతికి కిలోల బియ్యం, 2 వేల రూపాయ‌ల చొప్పున న‌గ‌దు, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. సుమారు 20 వేల కుటుంబాల‌ను ఆనాడు ఆదుకున్నారు. అయితే.. ఆ స‌మ‌యంలో శ్రీకాకుళం జిల్లా.. టెక్క‌లి ప్రాంతానికి చెందిన గ‌ర్భాన స‌త్తిబాబు అనే జ‌న‌సేన సైనికుడు ప‌వ‌న్‌ను క‌లిశారు.

``స‌ర్‌.. మీరు 25 కిలోల బియ్యం ఇస్తున్నందుకు సంతోషం. కానీ, 25 కిలోల బియ్యం కొన్ని రోజులే వుంటా యి. కానీ, మాకు కావాల్సింది.. 25 ఏళ్ల భ‌విష్య‌త్తు. ఆ దిశ‌గా ఆలోచ‌న చేయండి. 25 ఏళ్ల భ‌విష్య‌త్తుకు పునాదులు వేయండి.`` అని సూచించారు. ఈ ఆలోచ‌నే ప‌వ‌న్‌ను మేలి మ‌లుపు తిప్పిన విష‌యాన్ని తాజాగా మంత్రి మ‌నోహ‌ర్‌వెల్ల‌డించారు. అనంత‌రం.. తాము ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరు చేశామ‌ని.. త‌ర్వాత‌.. సంయుక్త పోరు చేప‌ట్టి.. పాతికేళ్ల ప్ర‌స్థానానికి పునాదులు వేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. సో.. మొత్తంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యూహాల‌ను ఓ `కార్య‌క‌ర్త మాట‌` మ‌లుపు తిప్పడం గ‌మ‌నార్హం.