వాళ్ళ మీద యాక్షన్ తప్పదు...పవన్ వార్నింగ్ !
తన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత అంటే తోలు ఒలిచేసేటంత అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 26 May 2026 11:57 PM ISTతన మీద అదే పనిగా ఒక పద్ధతి ప్రకారం దాడులు చేస్తున్న వారి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని వెబ్ సైట్స్ అదే పనిగా తన మీద దాడి చేస్తున్నాయని ఆయన చెప్పారు. అలాంటి వారి విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అన్నారు. వారి మీద బలంగానే యాక్షన్ ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.
పోగొట్టుకునేందుకు ఏమీ లేదు :
తన దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదని అన్నారు. తనను ఎంత బదనాం చేయాలో అంతలా చేశారు అని అన్నారు. కొందరు చాలా మెధాడికల్ గా దాడి చేస్తున్నారు అని అన్నారు. నన్ను ఎంత తిట్టారు అంటే ఇంక తిట్టడానికి ఏమీ లేనంత తనను ఎంత బదనాం చేశారు అంటే ఇక బదనాం చేయడానికి ఏమీ లేనంత అని పవన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్ని రకాలుగా తనను హింసించాలంటే అంతగానూ చేశారు అని అన్నారు. తనకు అనేక మంది గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అన్నారు. తాను ఎదురు మాట్లాడితే ఇళ్ళలో కూడా ఉండలేక పారిపోతారు అని పవన్ అన్నారు. తన గొంతు అంత బలంగా ఉంటుందని ఆయన చెప్పారు.
తోలి ఒలిచేసేటంత :
తన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత అంటే తోలు ఒలిచేసేటంత అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఎందుకులే అని ఊరుకుంటే ఇష్టం వచ్చినట్లుగా తన గురించి రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను ఇక మీదట ఊరుకోదలచుకోలేదని ఆయన అన్నారు. ఒక పార్టీని ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో నిర్మిస్తున్నపుడు మన పోరాటం కూడా అంతే క్రమశిక్షణతో నిబద్ధతతో ఉండాలని పవన్ అన్నారు. సాధకులు అంతా పార్టీలో తెలుసుకోవాలని ఆయన అన్నారు. సాధకులే పార్టీకి వెన్నెముక అని అన్నారు. మీరు బలంగా గట్టిగా నిలబడితే అంతా భయపడాలని పవన్ తమ పార్టీ సాధకులకు సూచించారు.
పవన్ లో ఫైర్ :
ఇదిలా ఉంటే పవన్ లో ఫైర్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలు ఇస్తున్న వార్నింగులు చూస్తే పవన్ జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. తన పార్టీ గురించి తన గురించి వ్యతిరేకంగా దాడులు చేయడం పట్ల ఆయన మండిపడుతున్నారు. మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని పవన్ అన్నారు. పవన్ అయితే ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేస్తున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది.చూడాలి మరి ఏమి జరుగుతుందో.
