Begin typing your search above and press return to search.

చిన్నారి నిరంజన్ కు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి బండ్ల గణేష్!

అనారోగ్య సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న చిన్నారి నిరంజన్ ఇటీవల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలని ఎంతగానో పరితపించిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   17 Jun 2026 4:19 PM IST
చిన్నారి నిరంజన్ కు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి బండ్ల గణేష్!
X

అనారోగ్య సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్న చిన్నారి నిరంజన్ ఇటీవల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలని ఎంతగానో పరితపించిన విషయం తెలిసిందే. చిన్నారి నిరంజన్ కోరికను తన కుటుంబ సభ్యులు జనసేన కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వరకు చేరవేయడంతో స్పందించిన పవన్ కళ్యాణ్ నేడు వరంగల్ జిల్లా హనుమకొండ లో ఉన్న నిరంజన్ ఇంటికి వచ్చి నిరంజన్ ను పరామర్శించడమే కాకుండా తక్షణమే లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.

అంతేకాదు నిరంజన్ తల్లికి ఒక క్యాంటీన్ పెట్టిస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. నిరంజన్ సోదరి చదువు పూర్తయ్యే వరకు మొత్తం ఖర్చు తనదేనంటూ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ వారి పట్ల చూపిన అభిమానానికి, ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అభిమాని నిరంజన్ ను కలవడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బండ్ల గణేష్ కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పుకునే ఆయన ఈ విషయంతో స్పష్టంగా నిరూపించుకున్నారు. ఇక తన అభిమాన హీరో దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ నిరంజన్ కు ఆర్థిక సహాయం చేయడంతో తన వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు బండ్ల గణేష్. ఈ మేరకు తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఒక నోట్ విడుదల చేశారు.

వరంగల్ హనుమకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడు పొనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండడం నాకు చాలా బాధగా అనిపించింది. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే నిరంజన్ కోరిక నేడు నెరవేరడం హృదయాన్ని కదిలించింది. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరగా ఆయన స్వయంగా నిరంజన్ ను కలవడానికి హనుమకొండకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కు అతని కుటుంబానికి అండగా నిలుస్తూ ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను" అంటూ బండ్ల గణేష్ తెలిపారు. ఏది ఏమైనా నిరంజన్ కు సెలబ్రిటీల నుండి ఆర్థిక సహాయం లభిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా వీరిపై ప్రశంసలు వెళ్లు వెత్తుతున్నాయి.