Begin typing your search above and press return to search.

పవన్ రెండు లక్షల పుస్తకాలు...ఎవర్ గ్రీన్ డిబేట్ !

ఇపుడు అదే కోవాలో టాలీవుడ్ లో టాప్ పవర్ స్టార్ అలాగే రాజకీయ నేతగా మారి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఏది మాట్లాడినా అది సంచలనం అవుతుంది.

By:  Satya P   |   7 July 2026 8:50 AM IST
పవన్ రెండు లక్షల పుస్తకాలు...ఎవర్ గ్రీన్ డిబేట్ !
X

కొందరి విషయం అంతే. వారు ఏది మాట్లాడినా అది చాలా కాలం పాటు చర్చగా సాగుతుంది. అనేక మంది అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అది వారికి ఉన్న పాపులారిటీగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇపుడు అదే కోవాలో టాలీవుడ్ లో టాప్ పవర్ స్టార్ అలాగే రాజకీయ నేతగా మారి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఏది మాట్లాడినా అది సంచలనం అవుతుంది. అది ఆయన సినీ గ్లామర్ కి పొలిటికల్ గ్రామర్ టచ్ ఇచ్చిన సరికొత్త ఇమేజ్ అని భావించాలేమో.

పవన్ గురించి ఆయన అలా :

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో జడ శ్రావణ్ కుమార్ ఏపీ రాజకీయాలలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టి కూడా అధికార ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. జడ శ్రావణ్ కుమార్ విమర్శలు సోషల్ మీడియాలో ఎపుడూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాల గురించి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ రెండు లక్షల పుస్తకాలు చదివారు అని శ్రావణ్ కుమార్ అన్నారు. నిజంగా ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివారా అని యాంకర్ ప్రశ్నిస్తే ఏమో నాకు తెలియదు ఆయనే చెప్పారు అని కూడా అన్నారు. ఇక పవన్ చదువు గురించి చెబుతూ ఆయన ఎంపీసీ బైపీసీ హెచ్ ఈసీ కూడా ఇంటర్ లో చదివారు అని సెటైర్లు వేశారు. అంతే కాదు ఆయన ఇంజనీరింగ్ కూడా చదివారు అని కామెంట్స్ చేశారు.

ఎవరేజ్ స్టూడెంట్ ని నేను :

జడ శ్రావణ్ కుమార్ తాను ఏవరేజ్ స్టూడెంట్ అని చెప్పుకున్నారు. తాను టెంత్ క్లాస్ లో మాధమెటిక్స్ పక్కన స్నేహితుడి సాయంతో ముప్పయి అయిదు మార్కులతో పాస్ అయ్యాయని చెప్పారు. ఇంటర్ హెచ్ ఈసీ తీసుకున్నాను అన్నారు. మెజిస్ట్రేట్ గా ఎలా పదవిని అందుకున్నారు అంటే తాను ఏవరేజ్ స్టూండెంట్ నే కానీ ఎక్కువగా చదవక పోవడం వల్ల తప్పించి తెలివి తేటలు లేవని కాదని అన్నారు. అంతే కాదు తాను ఎపుడూ ఫస్ట్ క్లాస్ లో పాస్ కాలేదని తన చిన్న నాటి విషయాలను చెప్పారు.

మరోసారి చర్చగా :

ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు సందర్భంగా ఆయనకు ప్రతీ చోటా బెయిల్ ఇప్పిస్తూ ఆయన వెంట తిరుగుతూ జడ శ్రావణ్ కుమార్ అందరినీ ఆకర్షించారు. ఆయన కూటమి ప్రభుత్వం మీద ఈ సందర్భంగా విమర్శలు కూడా పెద్ద ఎత్తున చేశారు. రాజకీయాల పట్ల మక్కువతో సొంత పార్టీ పెట్టి మరీ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటూ వస్తున్న జడ శ్రావణ్ కుమార్ పవన్ రెండు లక్షల పుస్తకాలు అంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ ఈ రెండు లక్షల పుస్తకాలు అన్నది ఎపుడో చాలా కాలం క్రితమే చెప్పినట్లుగా గుర్తు. కానీ ఇప్పటికీ పవన్ రెండు లక్షల పుస్తకాలు అని సెటైర్లు కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆలోచించాల్సిందే మరి. అంతే కాదు అది ఎవర్ గ్రీన్ డిబేట్ గానూ ఉంటోంది మరి.