అఫిషియల్: తెలంగాణలో పవన్ ప్రచారం!
తెలంగాణలో ఈ నెల 11న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 మునిసిపాలి టీలు.. 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By: Garuda Media | 4 Feb 2026 3:14 PM ISTతెలంగాణలో ఈ నెల 11న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 మునిసిపాలి టీలు.. 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక, ప్రచారం జోరుగా ప్రారంభం కానుంది. బీఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా.. కాంగ్రెస్ తరఫు న కూడా.. వ్యూహ, ప్రతివ్యూహాలు రెడీ అయ్యాయి. మరోవైపు.. బీజేపీ కూడా.. ప్రచారాన్ని ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం.. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారని... జనసేన పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటిం చింది. అయితే.. ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారనేది.. త్వరలోనే ప్రకటించనున్నట్టు పార్టీ తెలిపిం ది.
ఇక, జనసేన అధినేత.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షాల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని.. పార్టీ పేర్కొంది. ఎన్డీయే మిత్రపక్షాల్లో జనసేన కీలకంగా ఉంది. దీంతో పవన్ కల్యాణ్.. బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయేకు ప్రత్యేకంగా మిత్రపక్షాలు ఏమీ లేవు. టీడీపీ, జనసేనలే ఉన్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉన్నాయి. తొలుత రెండు పార్టీలు .. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని రెడీ అయ్యాయి.
కానీ, అనివార్య కారణాలతో వెనక్కి తగ్గాయి. ఇక, ఈ క్రమంలోనే బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇదిలావుంటే.. తాజా ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 116 మునిసిపాలిటీల్లో 50 శాతం స్థానాలను దక్కించుకోవాలని.. తద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే.. పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపుతున్నారన్న చర్చ జరుగుతోంది.
