Begin typing your search above and press return to search.

జ‌న‌సేన బిగ్ మిస్టేక్‌.. అలా చేయ‌కుండా ఉంటే!

ఏపీలో అధికారంలో ఉన్న జ‌న‌సేన పార్టీ తెలంగాణ‌లోనూ దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   31 Jan 2026 5:00 PM IST
జ‌న‌సేన బిగ్ మిస్టేక్‌.. అలా చేయ‌కుండా ఉంటే!
X

ఏపీలో అధికారంలో ఉన్న జ‌న‌సేన పార్టీ తెలంగాణ‌లోనూ దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేయాల‌ని భావించింది. ఇటీవ‌ల కొండ గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో టీటీడీ స‌హ‌కారంతో నిర్మించ‌నున్న దీక్షల విర‌మ‌ణ మండ‌పం స‌హా.. మ‌రో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ విష‌యా న్ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌లో పుంజుకుందామ‌ని.. పార్టీ ప‌రంగా స‌త్తా చాటుదామ‌ని.. కూడా కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశా రు. దీంతో స్థానికంలో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నాయ‌కులు ముందుకు వ‌చ్చారు. కానీ, ఇంత‌లోనే అప్ప‌టికే ఉన్న రాష్ట్ర క‌మిటీల‌ను ర‌ద్దు చేశారు. ఆ వెంట‌నే 15 రోజుల్లోనే కొత్త క‌మిటీలు వేసి.. వారికి స్థానిక ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని.. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే బాధ్య‌త కూడా ఈ క‌మిటీలే తీసుకోవాల ని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు.

దీంతో పాత క‌మిటీల‌ను ఉన్న‌ప‌ళాన ర‌ద్దు చేశారు. అదేస‌మ‌యంలో అడ‌హ‌క్ క‌మిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. కానీ, ఇక్క‌డే పెద్ద మిస్టేక్ జ‌రిగింద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న‌మాట‌. ఉన్న ప‌ళాన క‌మి టీల‌ను రద్దు చేయ‌డంతో కొత్త వారు ల‌భించ‌క‌పోగా.. ఉన్న‌వారు మైన‌స్ అయ్యారు. త‌మ బాధ్య‌త‌ల‌ను ఎందుకు తీసేశార‌న్న ప్ర‌శ్న‌తో వారు.. స్థానిక నాయ‌క‌త్వానికి లేఖ‌లు కూడా సంధించారు. ఈ వ్య‌వ‌హారం గోప్యంగా ఉంది. దీనిపైనే పార్టీ ఎటూ తేల్చుకోలేక పోతోంది.

గ‌డిచిపోయిన పుణ్య‌కాలం..

ఇంత‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రావ‌డంతోపాటు.. నామినేష‌న్ల ఘ‌ట్టం కూడా ముగిసి పోయింది. దీంతో జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రూ పోటీ చేయ‌లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ఒక‌టి అరా త‌ప్ప‌.. ఎక్క‌డా భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు ప‌డ‌లేదు. దీనికి కార‌ణం.. ఉన్న క‌మిటీల‌ను ర‌ద్దు చేయ‌డ‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఎలా ముందుకు వెళ్తుంది..? అనేది చూడాలి.