పవన్ తో ఎవరు కలుస్తారు.. మిలియన్ డాలర్ల ప్రశ్నే.. !
తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని చెబుతున్న పవన్ కల్యాణ్‌కు కలిసి వచ్చేదెవరు? ఆ పార్టీతో చేతులు కలిపేదెవరు? ఇదీ.. ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎక్కడైనా పాలు -తేనె మాదిరిగా.. పార్టీల మధ్య ఐక్యత ఉంటే గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేమీ కాదు.
By: Garuda Media | 5 Jun 2026 7:00 AM ISTతెలంగాణలో పార్టీని విస్తరిస్తామని చెబుతున్న పవన్ కల్యాణ్‌కు కలిసి వచ్చేదెవరు? ఆ పార్టీతో చేతులు కలిపేదెవరు? ఇదీ.. ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎక్కడైనా పాలు -తేనె మాదిరిగా.. పార్టీల మధ్య ఐక్యత ఉంటే గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేమీ కాదు. తాజాగా తెలంగాణలో పార్టీని పోటీకి పెడతామని చెప్పిన దరిమిలా .. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోతామని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే.. తానే ఈ విషయం లో సందేహాలు వ్యక్తం చేశారు.
ఎవరు తనతో కలిసి వస్తారో తనకు కూడా తెలియదని అన్నారు. వాస్తవానికి కేంద్రంలోను, ఏపీలోనూ అధి కారం పంచుకున్న బీజేపీ.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ అధికారం దక్కించుకోవాలన్నది బీజేపీ వ్యూహం. వాస్తవానికి కేంద్రంలో జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలతో ప్రధాని మోడీకి దన్నుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఏపీలోనూ బీజేపీకి మద్దతు ఇచ్చింది. మొత్తంగా బీజేపీ-జనసేన కలిసే ఉన్నాయి. అంతేకాదు.. తెలంగాణలోనూ 2023లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేశాయి.
కాబట్టి.. బీజేపీ కలిసి వచ్చే అవకాశంపై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. దీనిలో తప్పేమీ లే దు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయి. కవిత ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేనతో పాటు.. చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కూడా పార్టీ పెడుతున్న నేపథ్యంలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చిన పార్టీగా గుర్తింపు పడ్డ.. జనసేనతో(వాస్తవానికి తెలంగాణలోనే దీనిని ప్రారంభించారు) పొత్తుకు ఇప్పుడు బీజేపీ ఓకే అంటుందా? అనేది ప్రశ్న.
టీడీపీ సంగతేంటి.. ?
తెలంగాణలో విస్తరించాలని భావించే మరోపార్టీ టీడీపీ. పైగా.. ఏపీలోను.. కేంద్రంలోనూ జనసేన పార్టీతోనే కలిసి వుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు.. తెలంగాణ విషయంలో ఏం చేస్తుంది? అనేది ప్రశ్న. జనసేనతో కలిసి టీడీపీ కలిస్తే.. మంచిదనే వారు ఉన్నారు. ఇదేసమయంలో ఇరు పార్టీలకూ ఇబ్బందేనని చెబుతున్న వారు కూడా ఉన్నారు. కానీ.. టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అంతేకాదు.. పవన్ సభ విషయంలోనూ... ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌విషయంలోనూ బీజేపీ, టీడీపీలు పెద్దగా స్పందించ లేదు. ఈ నేపథ్యంలో పవన్‌తో కలిసి వచ్చే పార్టీలేవీ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
