Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మీద డైరెక్ట్ పవనాస్త్రం !

జనసేన అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే కాంగ్రెస్ మీద ఎటాక్ చేశారు.

By:  Satya P   |   3 Jun 2026 1:39 AM IST
కాంగ్రెస్ మీద డైరెక్ట్ పవనాస్త్రం !
X

జనసేన అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే కాంగ్రెస్ మీద ఎటాక్ చేశారు. ఆయన తన పార్టీ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఆయన తెలంగాణాలో ఇతర పార్టీలు ఉన్నా కూడా కాంగ్రెస్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని సైతం కుదుపు కుదిపారు. కాంగ్రెస్ పోకడలను ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ్ పార్టీయేనా అంటూ నిలదీసి మరీ గద్దించారు.

ఉత్తరాది కాంగ్రెస్ అంటూ :

కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది ఎక్కడ ఉంది అని పవన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశమంతా పోటీ చేయవచ్చా అని లాజిక్ తో కూడా క్వశ్చన్ సంధించారు. ప్రియాంకా గాంధీ దక్షిణాదిన కేరళంలో ఉన్న వాయనాడు లో ఎలా పోటీ చేసి ఎంపీగా గెలిచారు అని నిగ్గదీశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణాకు వచ్చి మీటింగులు పెట్టుకోవచ్చా అని కూడా అడిగారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినపుడు ఈ ప్రాంతీయ విధానాలు ఎందుకు అని ప్రశ్నించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ సొంత జాగీరుగా తెలంగాణాను భావిస్తున్నారు అని ఇతర పార్టీల నేతలు ఎవరూ రాకూడదని అంటున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు అని ఇదేమి విధానం అని ఆయన మండిపడ్డారు.

అత్యంత ప్రమాదకరం :

ఈ తరహా పోకడలు దేశ హితానికి ఏ మాత్రం మంచివి కావని పవన్ చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా వెళ్ళే స్వేచ్చ మాట్లాడే స్వేచ్చ రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు ఎవరికి వారు బౌండరీలు కట్టేసుకుంటే దేశంలో ఇంతకంటే అతి పెద్ద ముప్పు వేరొకటి ఉండదని అన్నారు. దేశమంతా ఒక్కటి అన్న భావన రావాలని ఆయన అన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే వారు అంతా ఇంత సంకుచితంగా ఎలా ఆలోచన చేస్తారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ వాదంతోనే :

పవన్ కళ్యాణ్ తన గంట ప్రెస్ మీట్ స్పీచ్ ద్వారా జాతీయ వాదం గురించి ఎక్కువగా మాట్లాడారు. పన్నెండు ఏళ్ళు అయినా ఇంకా అంధ్రా వారు అని విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రులను ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరుని గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను విభజనను కాంగ్రెస్ చేసిన తీరుని కూడా పవన్ ఎండగట్టారు. తలుపులు మూసేసి చేసిన ఈ విభజన వల్ల అందరి మనసులు గాయపడ్డాయని అన్నారు. తెలంగాణా ఏర్పాటుని ఎవరూ వ్యతిరేకించడం లేదని అదే సమయంలో సాఫీగా చేయాల్సిన దానిని అతి పెద్ద గాయంగా చేశారు అని అన్నారు. జాతీయ వాదం పట్ల కానీ దేశ సమైక్యత పట్ల కానీ కాంగ్రెస్ తీరు ఏంటని కూడా ఆయన అడిగి కడిగేశారు.

అసెంబ్లీలో తీర్మానం :

పవన్ కళ్యాణ్ తెలంగాణా రాకూడదని తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం చేయండి అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించడం సవాల్ చేయడం కూడా ఒక చర్చగా మారింది. కాంగ్రెస్ నేతలు కొందరి వైఖరులను కూడా ఆయన తప్పు పట్టారు. ఇలాగైతే ఇబ్బందులు వస్తాయని కూడా అన్నారు. మొత్తం మీద బీఆర్ ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ మీదనే పవన్ తన గురిని పెట్టడం అది కూడా జాతీయ వాదాన్ని ముందు పెట్టి మరీ కాంగ్రెస్ ని కార్నర్ చేయడం పట్ల అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ని కార్నర్ చేశారా అన్నదే బిగ్ డిబేట్ గా ఉంది అని అంటున్నారు.