దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. ఎప్పటి వరకంటే!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆధ్యాత్మిక మార్గాన్ని అలవరచుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన దీక్షలు చేపడుతున్నారు.
By: Garuda Media | 25 Jun 2026 11:12 AM ISTజనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆధ్యాత్మిక మార్గాన్ని అలవరచుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన దీక్షలు చేపడుతున్నారు. జ్యేష్ఠ మాసంతో ప్రారంభమయ్యే ఈ దీక్ష.. ఏకండా 120 రోజులకుపైగానే కొనసాగుతుంది. అనంతరం కార్తీక మాసంలో దీనిని ముగిస్తారు. ఈ ఏడాది కూడా పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం దీక్షా వస్త్రాలు ధరించి.. దీక్షను ప్రారంభించారు. అయితే.. ఈ విషయాన్ని పెద్దగా వెల్లడించకపోవడం గమనార్హం.
బుధవారం ఉదయం మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే ఆయన దీక్షావస్త్రాలు ధరించారు. పూజల అనంతరం ధ్యానం చేసిన తర్వాత.. తిరిగి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలోనే ఈ దీక్షా సమయంలో పవన్ ఉండనున్నారు. ధ్యానం, పూజలు, మంత్ర పఠనం వంటివి ఈ కాలంలో ఎక్కువగా చేస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే.. పాలనకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీక్షా వస్త్రాల్లోనే ఉప ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తారని, ఎక్కువగా పర్యటనలకు వెళ్లకపోవచ్చని వెల్లడించాయి. ఈ దీక్షా కాలంలో పరిమి తంగా భేటీలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపాయి. అయితే.. అధికారిక విధులకు సంబంధించి ఎవరినైనా కలుస్తారని.. అంతకుమించి పార్టీ పరంగా కొంత విరామం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఇక, దీక్షా సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి దూరంగా ఉండడంతోపాటు.. సాత్వికాహారమే తీసుకుంటారు. పాలు, పం డ్లు, ఉడికించిన కూరగాయలు వంటివి మితంగా తీసుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు. వస్త్ర ధారణలోనూ జాగ్రత్తలు పాటించనున్నారు. ఎరుపు రంగు అంచుతో కూడిన చందన వర్ణ దుస్తులను ధరించనున్నారు. ప్రతిరోజూ దేవతారాధన, అనుష్ఠా నాలు, ధ్యానంలో నిమగ్నమవుతారు. ఈ దీక్షా సమయంలో గురుముఖత నేర్చుకున్న మంత్ర పఠనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
