వావ్ పవన్.. వాటే ఏ స్టైల్.. అదరగొట్టిన డిప్యూటీ సీఎం డ్రెస్సింగ్
పాలిటిక్స్ లో ఇటువంటి లుక్ లో నేతలు కనిపించడం బహు అరుదుగా చెప్పొచ్చు. సీరియస్ పాలిటిక్స్ లో ఉన్న సాధారణంగా తెల్లటి ఖద్దరు ధరించి దగదగ మెరిసిపోతుంటారు.
By: Tupaki Political Desk | 9 Nov 2025 2:40 PM ISTడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ డైనమిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సాధారణ రాజకీయ నాయకుడికి భిన్నంగా ఆయన డ్రెస్సింగ్ ఉంటోంది. రాష్ట్రంలో ప్రధాన నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి లోకేశ్ డ్రెస్సింగ్ స్టైల్ కు భిన్నంగా పవన్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటోంది. ఆయన డ్రెస్సింగ్ లో ఒక సినిమా హీరో స్టైల్ తోపాటు రాజకీయ నాయకుడి అహర్యం, ఆధ్యాత్మిక భక్తిభావం, ఉద్యమకారుడి ఉత్సాహం చూపేలా బహుముఖ రూపం కనిపిస్తుంటుంది. తాజాగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి రెండు చోట్ల డిఫరెంట్ లుక్ లో కనిపించి సోషల్ మీడియా అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం తన రాజకీయ విధానాలతోనే కాకుండా సందర్భానుసారం ఆయన ఎంచుకునే విభిన్నమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిన్న శేషాచలం అడవిలో పర్యటించిన ఆయన నల్లని టీషర్టు, క్యామో-ప్యాంట్ (ఆర్మీ, పారా మిలటరీ యూనిఫాం) ధరించారు.
రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సుకు కమాండర్ గా తనను తాను ప్రజెంట్ చేసుకున్నారు. ఇక ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు వచ్చిన పవన్ పూర్తి భిన్నమైన రూపంలో దర్శనమిచ్చారు. ఒక సినీ హీరోలా ఇన్-షర్డ్ తో కనిపించిన పవన్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.
పాలిటిక్స్ లో ఇటువంటి లుక్ లో నేతలు కనిపించడం బహు అరుదుగా చెప్పొచ్చు. సీరియస్ పాలిటిక్స్ లో ఉన్న సాధారణంగా తెల్లటి ఖద్దరు ధరించి దగదగ మెరిసిపోతుంటారు. కానీ, పవన్ మాత్రం సందర్బానుసారం తన డ్రెస్సింగ్ మార్చేయడం సాధారణంగా కనిపిస్తుంది. గతంలో ఆయన దీక్షా వస్త్రాలతో ఒక భక్తుడి తనలో ఉన్న ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఇక సాధారణ రోజుల్లో, ముఖ్యంగా ఇంటర్వ్యూలు లేదా అనధికారిక సమావేశాల కోసం ఆయన తెల్లటి లేదా రంగుల లాల్చీ పైజామాను ఎక్కువగా ధరిస్తారు. ఈ వేషధారణతో తాను ఒక సామాన్య వ్యక్తి, కళాకారుడిగా చెప్పుకోడానికి మాత్రమే ప్రయత్నిస్తారని అంటున్నారు.
