Begin typing your search above and press return to search.

జనసేన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా.. ఏమిటీ రీట్వీస్ట్ పోస్టులు..?

అవును... తాజాగా జనసేన పార్టీకి చెందిన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకర్ల బారిన పడినట్లు కనిపిస్తోంది.

By:  Raja Ch   |   9 Nov 2025 10:32 AM IST
జనసేన ట్విట్టర్  అకౌంట్  హ్యాక్  అయ్యిందా.. ఏమిటీ రీట్వీస్ట్  పోస్టులు..?
X

ప్రముఖులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు, ఫేస్ బుక్ అకౌంట్లు పలు సందర్భాల్లో హ్యాకర్ల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలామంది సెలబ్రెటీలో బాధితులుగా ఉన్నారు! ఈ క్రమంలో సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలో అయ్యే తెలుగు రాజకీయ పార్టీలలో ఒకటైన జనసేన కూడా ఇప్పుడు హ్యాకర్ల బారిన పడినట్లు కనిపిస్తుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... తాజాగా జనసేన పార్టీకి చెందిన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకర్ల బారిన పడినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా... శనివారం రాత్రి నుంచి జనసేన ట్విట్టర్ ఆదివారం ఉదయం వరకు సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పొలిటికల్ పోస్టులు కనిపించే జనసేన హ్యాండిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్ సంబంధించిన రీ ట్వీట్ చేసిన పోస్టులు దర్శనమిస్తున్నాయి.

దీంతో.. ఇది చూసిన పార్టీ అభిమానులు, శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్ల పన్నాగమై ఉండొచ్చని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమై, సైబర్‌ క్రైమ్‌ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది.

కాగా... గత ఏడాది ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాకయిన సంగతి తెలిసిందే. అసలే ఎన్నికల టైమ్ కావడంతో పార్టీకి సంబంధించిన వీడియోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలు ఉండటంతో పార్టీ యూట్యూబ్ ఛానల్ ఫుల్ యాక్టివ్‌ గా ఉన్న సమయంలో ఆ సంఘటన జరిగింది.

ఆ సమయంలో... ఆ యూట్యూబ్ ఛానల్ లో జనసేన పార్టీకి చెందిన వీడియోలను తొలగించిన హ్యాకర్లు.. బిట్ కాయిన్ వీడియోలు అప్ లోడ్ చేశారు! జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి, మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేశారు!